ఈ బ్యాంక్ కస్టమర్స్ కి శుభవార్త..!

-

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్స్ కి గుడ్ న్యూస్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తాజాగా వడ్డీ రేట్లను సవరించింది. ఇక పూర్తి వివరాలను చూస్తే.. అక్టోబర్ 26 నుంచి రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లు ప్రకటించారు. డిపాజిట్లపై వడ్డీని 75 bps వరకు పెంచారు. ఇప్పుడు 600 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 7 శాతం వడ్డీ రేటును ఇస్తోంది ఈ బ్యాంకు.

ఏడాది నుండి 599 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై అయితే 5.70 శాతం నుంచి 6.30 శాతానికి వడ్డీని పెంచారు. అదే విధంగా 180 రోజుల నుంచి ఏడాది కంటే తక్కువ వాటిపైన అయితే 5 శాతం నుంచి 5.50 శాతానికి పెంచేశారు. 46 రోజుల నుంచి 90 రోజుల ఎఫ్‌డీపై 75 bps పెంచారు. 4.50 శాతానికి అయ్యింది. ఇక కొత్త వడ్డీరేట్లను చూస్తే.. 7 రోజుల నుంచి 14 రోజులకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం ఇస్తున్నారు. 15- 29 రోజులకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం ఇస్తున్నారు.

30- 45 రోజులకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం ఇస్తున్నారు. 46-90 రోజుల ఎఫ్‌డీలపై 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం ఇస్తున్నారు. 91- 179 రోజులకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం, 180- 270 రోజులకి 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.00 శాతం వడ్డీ రేట్లు వర్తిస్తాయి. 271 రోజుల నుంచి ఏడాదికి 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.00 శాతం వడ్డీని ఇస్తున్నారు. సంవత్సరం ఎఫ్‌డీపై 6.30 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.80 శాతం వడ్డీరేటు ఇస్తున్నారు. ఏడాది నుండి 599 రోజుల ఎఫ్‌డీ కి 6.30 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.80 శాతం ఇసున్నారు. రెండు నుంచి మూడేళ్ల ఎఫ్‌డీపై 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం వడ్డీరేట్లు వర్తిస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news