మీ డాక్యుమెంట్లు స్కాన్‌ చేసుకోవడానికి మరో కొత్త యాప్‌!

-

దిగ్గజ గూగుల్‌ యాప్‌ మరో సరికొత్త యాప్‌ను విడుదల చేసింది. ఇది మీ ముఖ్యమైన పత్రాలను స్కాన్‌ చేయడంతో పాటు వాటిని భద్రంగా దాచి ఉంచడానికి, నిర్వహణకు సంసిద్ధమవుతోంది.
అదే ‘స్టాక్‌’ యాప్‌. దీన్ని గూగుల్‌కు చెందిన ఏరియా 120 దీన్ని అభివృద్ధి చేసింది. ఈ స్కానర్‌ యాప్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది. స్మార్ట్‌ ఫోన్‌తో ఫోటో తీసిన డాక్యుమెంట్లను వివిధ బిల్లులను దీని ద్వారా స్కాన్‌ చేయవచ్చు. అలాగే వీటిని వినియోగదారులు భద్రంగా దాచి ఉంచవచ్చు. ఈ యాప్‌ ఆటోమెటిగ్గా సేవ్‌ చేసేస్తుంది. దీనికి ఆప్టికల్‌ కేరెక్టర్‌ రికగ్నిషన్‌ యాప్‌ను ఉపయోగిస్తుంది.

 

  • స్కాన్‌ చేసిన డాక్యుమెంట్లలోని నంబర్లు, బిల్లు బకాయిలను తేదీల వివరాలను యాప్‌ సులభంగా గుర్తిస్తుంది. వినియోగదారులకు అలర్ట్‌ చేస్తుంది. కీ వర్డ్స్‌ను ఉపయోగించి ఫైల్‌ లొకేషన్ను కూడా సెర్చ్‌ చేసే అవకాశం ఉంది.
  • ఈ గూగుల్‌ స్కానర్‌ యాప్‌కు మెరుగైన సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. స్టాక్‌ యాప్‌ను బయోమెట్రిక్‌ లేదా పేస్‌ రికగ్నిషన్‌ ద్వారా యాక్సెస్‌ చేయవచ్చు.
  • డాక్యుమెంట్లను గూగుల్‌ డ్రైవ్‌లో సేవ్‌ చేసుకోవచ్చు. ఈ ప్రయోగాత్మక యాప్‌ను గూగుల్‌ కొనసాగిస్తుందా? లేదా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.
  • ఈ యాప్‌ను ప్రస్తుతం అమెరికాలోని ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు దీన్ని అందుబాటులో ఉంచారు. యాప్‌ను ఇతర దేశాల యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చే విషయంపై కూడా గూగుల్‌ స్పందించలేదు.
  • అమెరికా యూజర్లు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి స్టాక్‌ యాప్‌ను ఉచితంగా డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు.
  • ఇప్పుడు ఉన్న క్యామ్‌ స్కానర్, అడోబ్‌ యాప్‌లను డాక్యుమెంట్‌ స్కానింగ్‌లకే వాడుతున్నాం. వీటికి మంచి ఆధరణ ఉంది. ఒకవేళ గూగుల్‌ స్టాక్‌ యాప్‌ అందరికీ అందుబాటులోకి వస్తే ఇతర సంస్థలకు గట్టిపోటీనే ఇస్తుంది.
  • ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న స్కానింగ్‌ యాప్‌లు ఏఐ సామర్థ్యాలతో పనిచేయట్లేదు.అందుకే ఈ స్టాక్‌ యాప్‌ అద్భుతమైన ఫీచర్లు ఉండటం వల్ల ఇతర యాప్‌లపై పైచేయి సాధించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక మన డాక్యుమెంట్లను స్కాన్‌ చేసి భద్రంగా దాచి ఉంచడానికి ఈ స్టాక్‌ యాప్‌ పనిచేస్తుంది. ఇది మన భారతీయులకు అందుబాటులోకి ఎప్పుడు వస్తుందో ఎదురు చూద్దాం!

Read more RELATED
Recommended to you

Exit mobile version