వ్యక్తులు కాదు.. వ్యవస్థ ముఖ్యం. గవర్నర్ ప్రోటోకాల్ వివాదంపై ఈటెల ఆగ్రహం

గవర్నర్ తమిళి సై మేడారం పర్యటన.. ప్రోటోకాల్ వివాదం రాజకీయ రచ్చను మొదలైంది. నిన్న గవర్నర్ తమిళిసై మేడారంలో సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. అయతే గవర్నర్ స్వాగతం, వీడ్కోలు పలికేందుకు మంత్రులు కానీ జిల్లా కలెక్టర్, ఎస్పీలు అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. తాజగా ఈ వివాదంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

etela
etela

రాష్ట్ర ప్రథమ పౌరురాలికి అవమానం జరిగిందని.. అధికారులు ప్రోటోకాల్ పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు. మంత్రులు, కలెక్టర్, ఎస్పీలు ప్రొటోకాల్ పాటించకపోవడంపై బీజేపీ నేత ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యక్తులు కాదు.. వ్యవస్థ శాశ్వతం అని ఆయన అన్నారు. వ్యవస్థకు గౌరవం ఇచ్చి ప్రధాని మోదీ.. సీఎం కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారని ఆయన అన్నారు. సీఎం బిజీగా ఉంటే కనీసం మంత్రులైనా వెళ్లాలి కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.