అదిరే స్కీమ్.. రూ.5 లక్షల వరకు ఉచిత ట్రీట్‌మెంట్… పూర్తి వివరాలు ఇవే..!

-

నాణ్యమైన వైద్య సేవలను అందించడం కోసం ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన స్కీమ్ ని కేంద్రం తీసుకొచ్చింది. సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని కేంద్రం అందిస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఆర్థికంగా నిరుపేదలైన వారు ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా ఆరోగ్య సేవలను ప్రభుత్వం ఇస్తోంది. దీనితో దేశంలో ఏ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయినా లబ్దిదారులు ఉచితంగా ఆరోగ్యసేవలను పొందవచ్చు.

 

ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన ఫీచర్స్:

దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కడైనా ఒక్కో కుటుంబం ఒక్కో ఏడాది రూ.5 లక్షల వరకు ట్రీట్మెంట్ చేయించుకోచ్చు.
లబ్దిదారులకు ఆరోగ్య సంరక్షణ సేవలను నగదు రహితంగా అందిస్తోంది.
ఈ స్కీమ్ తో 10.74 కోట్లకు పైగా పేద, వెనుకబడిన వర్గాల కుటుంబాలకు ప్రయోజనం.
అన్ని ఆరోగ్య చికిత్సలను కవర్ చేస్తుంది.
ఇంట్లో దివ్యాంగులు ఉండి, ఆరోగ్యకరమైన వ్యక్తులు లేని కుటుంబాలు.
16 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మగవాళ్లు లేని వారు, సంపాదించే వ్యక్తి లేని కుటుంబాలు.
కూలి పని చేసుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేకుండా వున్నా కుటుంబాలు.
బిచ్చగాళ్లు, కూలీలు, నిర్మాణ కూలీలు, పెయింటర్లు, సెక్యూరిటీ గార్డులు, ప్లంబర్లు వంటి వారు ఈ పథకం కింద లబ్ది పొందవచ్చు.

ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన స్కీమ్ కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి:

దీని కోసం మీరు https://pmjay.gov.in/లోకి వెళ్లాలి.
మీరు అర్హులో కాదో తెలుసుకోవాలంటే అర్హుడిని అవుతానా అనే దాని మీద క్లిక్ చేయండి.
మీ మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేస్తే , మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది.
నెక్స్ట్ మీరు వివరాలను నమోదు చేయాలి.
ఒకవేళ మీ కుటుంబం ఆయుష్మాన్ భారత్ యోజన కింద కవర్ అయితే మీ పేరు డిస్‌ప్లే అవుతుంది.
14555 లేదా 1800 111 565కి ఫోన్ చేసి అర్హత వంటి వివరాలని తెలుసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news