ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు జీతం ఎంతంటే?

-

ఇంటర్ ఎంపీసి గ్రూపు విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఉచితంగా బీటెక్‌ చదువుతోపాటు.. నేవీలో సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. జేఈఈ మెయిన్స్‌ ర్యాంక్, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూల ఆధారంగా ఈ నియామకాలు చేపడతారు. ఈ అవకాశం వచ్చినవారికి ఇంజినీరింగ్‌ విద్యతో పాటు పుస్తకాలు, వసతి, భోజనం అన్నీ ఉచితంగానే దక్కుతాయి. చదువు, శిక్షణ పూర్తయిన వెంటనే విధుల్లోకి తీసుకుంటారు.. ఫస్ట్ మంత్ నుంచి సాలరీ లక్ష రూపాయలు ఉంటుంది..ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 12, 2022..

వయసు: జనవరి 2, 2004 – జులై 1, 2006 మధ్య జన్మించినవారు అర్హులు..

విద్యార్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల్లో 70 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణతతోపాటు పదోతరగతి లేదా ఇంటర్‌ ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. వీటితోపాటు అభ్యర్థులు జేఈఈ మెయిన్‌-2022లో అర్హత సాధించాలి. అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి.. ఎత్తుకు తగ్గ విధంగా బరువు కూడా ఉండాలి..

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://www.joinindiannavy.gov.in/

మరింత సమాచారం తెలుసుకోవాలనుకొనేవారు పైన తెలిపిన లింక్ ద్వారా తెలుసుకోవచ్చు..

ఈ పోస్టులకు ఎంపికైనవారికి శిక్షణ తరగతులు జూన్‌ 2023 నుంచి ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ఇంటర్వ్యూలో సాధించిన మార్కులు, ఖాళీలకు అనుగుణంగా ఇండియన్‌ నేవల్‌ అకాడెమీ, ఎజిమాళ (కేరళ)లో బీటెక్‌ అప్లయిడ్‌ ఎల్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ లేదా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ లేదా ఎల్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లోకి తీసుకుంటారు. చదువుతోపాటు వసతి, భోజనం, పుస్తకాలు.. అన్నీ ఉచితంగా అందిస్తారు..ఆ తర్వాత సెలెక్ట్ అయినవారిని నేవి లోకి తీసుకుంటారు.. పూర్తి వివరాలను తెలుసుకొని అప్లై చేసుకోగలరు..

Read more RELATED
Recommended to you

Latest news