వాట్సాప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజ్ యాప్స్ లో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంది. సులభంగా వాట్సప్ ద్వారా చాట్ చేసుకోవచ్చు.
అలానే కొత్త కొత్త ఫీచర్లు కూడా వాట్సాప్ లో ఉంటాయి. అలానే ఈ యాప్ తో సులభంగా ఫోటోలు, వీడియోలు మొదలైనవన్నీ కూడా షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మనం వీడియో కాల్స్, గ్రూప్ కాల్స్ కూడా చేసుకో వచ్చు. జూమ్, గూగుల్ వంటి యాప్స్ లో అందుబాటులో ఉన్న ఫీచర్ వాట్సాప్ లో కూడా తీసుకు రావాలని వాట్సాప్ అనుకుంటోంది.
గూగుల్ మీట్ లో మనం ఎలా అయితే లింక్ క్రియేట్ చేసి ఇతరులకి పంపిస్తామో.. అలానే వాట్సాప్ లో కూడా ఈ ఫీచర్ ని తీసుకు రావాలని వాట్సాప్ అనుకుంటోంది. దీని గురించి టెస్టింగ్ కూడా చేస్తున్నారు. ఒకవేళ కనుక ఇది వస్తే కాల్ ని హోస్ట్ చేసే వ్యక్తి ఈ లింక్ ని క్రియేట్ చేసి ఇతరులకు షేర్ చేయవచ్చు.
అదే విధంగా కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వాళ్ళని కూడా ఇన్వైట్ చేసే అవకాశం ఈ ఫీచర్ లో ఉంటుంది. ఒకవేళ కనుక ఈ ఫీచర్ ఉంటే వాట్సాప్ ద్వారానే మనం లింక్ ని క్రియేట్ చేసుకోవచ్చు. దీని కోసం ఇతర యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకోక్కర్లేదు ఇలా ఈజీగా గ్రూప్ కాల్స్ ని ఈ ఫీచర్ ద్వారా మనం పొందవచ్చు.