Gujarat : సూరత్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

-

నేడు గుజరాత్ లోని సూరత్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు.ఈ క్రమంలో తాపీ కక్రాపర్‌లో రెండు 700 మెగావాట్ల అణు కేంద్రాలను మోడీ జాతికి అంకితం చేయనున్నారు.వీటిని 22,500 కోట్ల రూపాయలతో నిర్మించినారు.ఇది ఇండియాలోనే తొలి అణు విద్యుత్ కేంద్రం కానుంది. ఈ నేపథ్యంలో మెహసానా, నవ్‌సారిలో రూ.22,850 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

అంతేకాకుండా ప్రధాని మోడీ రూ. 10,700 కోట్లతో నిర్మించనున్న వడోదర-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలో యాబై ఏళ్ల శ్వేత విప్లవం, అమూల్‌ స్థాపన సందర్భంగా నేడు అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో పాల్గొననున్నారు . ఈ వేడుకల్లో 1.25 లక్షల మంది రైతులు, పశువుల కాపరులను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్,
కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా లు కలిసి అమూల్ యొక్క 1200 కోట్ల రూపాయల విలువైన ఐదు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version