ఆర్కే పబ్లిక్ గార్డెన్ లో బయటపడ్డ తుపాకులు !

-

ఆర్కే పబ్లిక్ గార్డెన్ లో తుపాకులు కలకలం సృష్టించాయి. గార్డెనింగ్ చేస్తుండగా రెండు తపంఛాలు, ఒక రివాల్వర్ బయటపడ్డాయి. ఒక కవర్లో చుట్టి చెట్లపొదల్లో పడేశారు గుర్తుతెలియని వ్యక్తులు. గార్డెనింగ్ లో బయటపడడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు గార్డెన్ సిబ్బంది. దీంతో తుపాకులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ రోజు మరోసారి తుపాకులు దొరికిన ప్రాంతంలో పంచనామా నిర్వహించారు సైఫాబాద్‌ పోలీసులు.

తుపాకులు లభించిన రెండు మీటర్ల దూరంలోనే సీసీ కెమెరాలు గుర్తించారు. ఈ సందర్భంగా సైఫాబాద్ సీఐ సత్తయ్య మాట్లాడుతూ.. రెండు తపంఛాలు, ఒక రివాల్వర్ దొరికాయన్నారు. వాటిని ఓ కవర్ లో చుట్టి పడేశారని.. మూడు తుపాకులు తుప్పు పట్టి ఉన్నాయని తెలిపారు. పడేసి చాలా రోజులు అవుతున్నట్లు తెలుస్తోందన్నారు. ఎవరు ఎందుకోసం తీసుకువచ్చి పడేసారో దర్యాప్తులో తేలుతుందన్నారు.

తుపాకులను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపించామన్నారు. తుపాకులకు తుప్పు పట్టి ఎంత కాలం అవుతుందో తెలిస్తే సీసీ కెరాలను పరిశీలించవచ్చన్నారు. ప్రస్తుతం తుపాకులు దొరికిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలు ఫీడ్ నెల రోజుల వరకే ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news