గుప్పెడంతమనసు ఎపిసోడ్ 263: రిషీలో మార్పు గురించి మహేంద్రతో మాట్లాడిన ధరణి..కాలేజ్ లో రిషీకి ఊహించని సీన్

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో ఫణీంద్ర, మహేంద్ర జగతి గురించి మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు. పక్కనే ఉన్న దేవయాని అంటే ప్రోగ్రామ్ విజయంలో రిషీ పాత్రలేదంటారా, అంతా జగతిదే గొప్పంటారా అంటుంది. ఫణీంద్ర ఏంటి దేవయాని నువ్వు మొదట రిషీ గురించే చెప్పాను కదా అయినా రిషీకి జగతికి పోలికేంటి అంటాడు. దేవయాని వాదిస్తూ ఉంటుంది. ఇంతలో రిషీ వస్తాడు..అది చూసి దేవయాని..అదిగో రిషీ వస్తున్నాడు, ఏమన్నా అంటే కాలేజ్ వేరు కుటుంబం వేరు అంటారు అంటుంది. రిషీ ఏంటి పెద్దమ్మా ఏమో అంటున్నారు అంటాడు. ఇంతలో మహేంద్ర ఏం లేదు రిషీ ప్రోగ్రామ్ సక్సస్ అయింది కదా దానిగురించే మాట్లాడుకుంటున్నాం అంటాడు. మహేంద్ర, ఫణీంద్ర రిషీకి కంగ్రాస్స్ చెప్తారు. ఏం పెద్దమ్మా మీరు చెప్పరా అంటాడు రిషీ..నీకు చెప్తే నాకు నేను చెప్పుకున్నట్లే కదా అంటుంది దేవయాని. మనోడు..చాలా బాగా చెప్పారు పెద్దమ్మ అంటూ అలా మాట్లాడుకుంటారు.

కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో రిషీ ఉదయం వసుధారతో కలిసి దిగిన ఫొటో చూస్తూ ఉంటాడు. దాన్ని జూమ్ చేస్తూ అలా తీక్షణంగా చూస్తాడు. ఇంతలో ధరణి వస్తుంది..ధరణి కూడా చూస్తుంది. రిషీ అని పిలవగానే, రిషీ కంగారుగా ఫోన్ కిందపడేయబోతాడు. జాగ్రత్త రిషీ..ఫొటో చాలాబాగుంది అంటుంది. ఏం లేదు వదినా జస్ట్ ఒక ఫొటో అంతే, ఆ డ్యాన్స్, ఆ గెటప్, ఎడ్యూకల్చర్ ప్రోగ్రామ్ అంతే అంటూ రిషీయో కంగారుగా చెప్తాడు. ధరణి ఎందుకు అంత కంగారు పడుతున్నావ్, నేనెం అడగలేదుకదా కానీ ఆ ఫొటోలో మీ ఇద్దరు మాత్రం స్పెషల్ గా ఉన్నారు అంటుంది. నాకు ఆ ఫొటో పంపిస్తావా అంటే అయ్యో వదినా జస్ట్ అది ఫొటో అని అంటూ నో చెప్తాడు.ధరణి వసుధార అని ఏదో చెప్పబోతుంది..ఇంతలోనే రిషీ వసుధార నా స్టూడెంట్ అంతే. కాకపోతే కొంచెం స్పెషల్ స్టూడెంట్ అంటాడు. ధరణి ఆ మాటకు నవ్వి వెళ్లిపోతుంది.

ఇటువైపు వసుధార ఆ నెమలీక పట్టుకుని రిషీ ఇచ్చిన సీన్ గుర్తుచేసుకుంటుంది. దాన్ని ఒక ఫ్లవర్ వాజ్ లో వేసి ఎంత అందంగా ఉందో అనుకుని ఫొటో తీస్తుంది. తీసింది కామ్ గా ఉండొచ్చుగా..మళ్లీ ఆ ఫొటో రిషీ సార్ కి పంపిస్తే ఎలా ఉంటుంది..అమ్మో అరుస్తారా, ఏంటి ఈ చిన్నపిల్లల చేష్టలు అంటారా అనుకుంటుంది. గతంలో తనబుక్ రిషీ చేతిలో ఉన్నప్పుడు బుక్ లోంచి నెమలీక జారిపడిన సీన్ తలుచుకుని బుక్ తీసి ఆ నెమలీకను కూడా అందులో పెట్టి ఫొటో తీస్తుంది. ఫొటో రిషీ సార్ కి పంపిస్తే తిట్టొచ్చు, ఏమైనా అనొచ్చు, ఏమీ అనకపోవచ్చు అనుకుంటూ ఉంటుంది.

ఇంకోపక్క రిషీ కూడా అదే నెమలీక ఇచ్చిన సీన్ తలుచుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆ వసుధార ఫొటో పంపిస్తుంది. నేనేంటి వసుధార గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను, తనేదో నాకు ఫొటో పంపించింది, బాగుందనే ఏదో మెసేజ్ పెట్టాలి కానీ అనుకుని.. గుడ్ నైట్ అని మెసేజ్ చేస్తాడు. ఇంతమంచి ఫొటోపంపిస్తే గుడ్ నైట్ అని మెసేజ్ చేస్తాడేంటి రిషీ సార్ కి టేస్ట్ లేదా అనుకుని ఆ నెమలీకతో ఆడుకుంటుంది.

మహేంద్ర వెళ్తుంటే..ధరణి మావయ్యగారు మీకు ఏమన్నా కావాలా అని అడుగుతుంది. ఏం వద్దమ్మా నా కొడుకును ఓ సారి కలిసివెళ్ధాం అని వెళ్తున్నాను..వాడి మూడ్ బాగుందా అంటుంది. బాగుంది అని వసుధార విషయంలో రిషీ అభిప్రాయం ఏంటంటారు అంటుంది ధరణి. మహేంద్ర ధరణీ ఏంటి ఇలా అడిగేసింది, జగతి ఊహించినట్లే ధరణీ కూడా అనుకుంటుందా అనుకుని నీకెందుకు ఇలా అడగాలనిపించిందమ్మా అని ధరణీని అడుగుతాడు. ఒకప్పుడు సాక్షితో(రిషీ మాజీ ప్రేమికురాలు) మాట్లాడిన రిషీ, ఇప్పుడు వసుధారతో మాట్లాడిన రిషీ వేరు,ఆ మాటతీరు అంతా మారిపోయింది మావయ్యగారు అంటుంది. మహేంద్ర..రిషీని ఇంతదగ్గరనుంచి గమనిస్తున్నావా తల్లీ అంటాడు.

ధరణీ..అత్తయ్య పెంపకంలో వజ్రం లాంటి రిషీ ఆలోచనలు మసకబారాయి, ఇప్పుడు వసుధార పరిచయంతో వాటికి కొంచెం పదునుపెట్టినట్లైంది..ఇది ఇలానే ఉంటే బాగుంటుంది, ఎప్పుడో ఒకసారి జగతి అత్తయ్య విషయంలో కూడా మార్పురావచ్చుకదా మావయ్యగారు అంటుంది. మహేంద్ర కరెక్ట్ గా చెప్పావ్ అమ్మా అంటాడు. ఇంతలో ధరణీ అని దేవయాని పిలుస్తుంది. ఏంటి ధరణి..ఈ టైంలో ఇక్కడ మహేంద్రతో ఏంటీ నీకు మాటలు అంటుంది. మహేంద్ర, ధరణీలు వీళ్లు మాట్లాడుకుంది వినేసిందేమో అని భయపడతారు. ఏంలేదు వదినా మేమేం ఏదో రిషీ గురించి మాట్లాడుకుంటున్నాం అంటాడు. అంతేనా నా గురించి కంప్లైంట్ చేస్తుందా అంటుంది దేవయాని, తనకి అంత ధైర్యం ఉంటుందా..నువ్వు వెళ్లమ్మా అని ధరణిని పంపించి మహేంద్ర కూడా వెళ్లిపోతాడు.

ఇంకోసీన్ లో వసూ నెమలీకను పట్టుకునే పడుకుంటుంది. జగతి చూసి..అది తీయబోతుంది. వసూ నిద్రలో థ్యాంక్యూ రిషీ సార్ అంటుంది. జగతి వసూకి ఏమైంది ఈ నెమలీక ఏంటి అనుకుని ఆ నెమలీకను తీసి ఆ ఫ్లవర్ వాజ్ లో పెట్టి వెళ్లబోతుంది. ఇంతలో రిషీ ఫోన్ చేస్తాడు. జగతి గతంలో అలా ఫోన్ తీసినందుకే రిషీ తిట్టిన సీన్ గుర్తుచేసుకుని ఫోన్ లిఫ్ట్ చేయదు. కానీ రిషీ మళ్లీ చేస్తాడు. ఇక జగతి బాగా ఆలోచించి మొత్తానికి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఫోన్ ఎత్తగానే రిషీ..హలో వసుధార పడుకున్నావా అంటాడు. జగతి వెంటనే గుడ్ ఈవినింగ్ సార్, వసుధార నిద్రపోతుంది సార్, నేను వేరేవాళ్ల ఫోన్లు తీయొద్దు అనుకున్నాను..కానీ రెండుసార్లు ఫోన్ చేశారంటే ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుందని తీశాను సార్, చెప్పండి ఏమైనా చెప్పాలా అంటుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయిభాగంలో కాలేజ్ లో స్టాప్ జగతిని సత్కరించాలనుకుంటారు. రిషీ, జగతి పక్కన నుల్చుంటారు. జగతి చేయి రిషీకి తగలుతుంది. రిషీ వెంటనే పక్కనే ఉన్న వసుధార చేయిపట్టుకుని తనపక్కన నిలబెట్టుకుంటాడు. ఈ సీన్ భలేగా ఉంటుంది..కానీ పాపం జగతి ఫీల్ అవుతుంది. ఆ తర్వాత వసూ ఫోటో తీస్తుంది. జగతి, రిషీ పక్కనే నిలబడి ఉంటారు. రిషీ మొదట ఒప్పుకోడు కానీ ఫణీంద్ర తప్పేముందు రిషీ..ఒక జ్ఞాపకంలా ఉంటుంది అంటాడు. మరన్ని వివరాలు రేపటి ఎపిసోడ్లో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version