గుప్పెడంతమనసు ఎపిసోడ్ 340: మొదలైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ..కొంచెం కొంచెంగా జోష్ పెంచిన రిషీ

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో లైబ్రరీలో గౌతమ్ వసుధార కోసం హమ్ చేస్తూ ఉంటాడు. వసుధార వచ్చి హుష్ అంటుంది. గౌతమ్ సైలెన్స్ హా..కష్టం వసుధార, లైబ్రేరియన్ అలానే చెప్పాడు..నేను రిషీ ఫ్రెండ్ ను నీ ఉద్యోగం ఊడిపోవాలా అన్నా..అంతే దెబ్బకు కామ్ అయిపోయాడు..నువ్వెల్లి నేను చెప్పిన బుక్ వెతుకు లైబ్రేరియన్ ని ఆడగకు అంటాడు. మీరు రిషి సర్ ఫ్రెండ్ అన్న గౌరవంతోనే ఈ బుక్ వెతుకున్నా..సైలెన్స్ ప్లీజ్ అని పేపర్ పై రాసిస్తుంది. అది చదివిన గౌతమ్..బయటకు శబ్దం చేయకపోయినా మనసులో విచ్చలవిడిగా గోల చేస్తా అంటాడు. ఇంతలో అక్కడకు వెళ్లిన రిషి..గౌతమ్ ని నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. సైలెన్స్ అని వేలు చూపిస్తాడు గౌతమ్. ఇంతలో వసుధార రాసిన పేపర్ చూసిన రిషి..నన్ను ఇలా కూడా వాడుకుంటున్నావా అంటాడు. ఇంతలో బుక్ తీసుకొస్తున్న వసుని చూసుకోకుండా డ్యాష్ ఇచ్చిన రిషి..ఆమె పడిపోకుండా పట్టుకుంటాడు. పాపం గౌతమ్ ఛాన్స్ మిస్స్ అయిందే అనుకుంటాడు. కింద పడిన బుక్ తీసి ఏంటిది అని అడిగిన రిషితో.. రోమియో జూలియట్ అందమైన ప్రేమకథ అని చెబుతాడు గౌతమ్. వసుకి ఈ పనులు చెబుతావా అంటే..కాలేజీ యానవర్సిరీకి ఓ నాటకం కావాలని అడిగావ్ కదా అని కవర్ చేస్తాడు. నువ్వు క్లాసుకి వెళ్లు వసుధార అని పంపించేస్తాడు. సార్ మీ క్లాస్ ఉంది ఇప్పుడు అని వసూ అంటే..నాకు తెలియదా..నేను క్లాస్ కి వెళ్తే గాని నువ్వురావా అని తిట్టిపంపిస్తాడు. ఏంటా అబద్దాలు, నేను అసలు నిన్ను బుక్ అడిగానా అంటే..ఏ‌వో సర్ధుబాటుల్లే అంటాడు గౌతమ్..వెళ్లి క్యాబిన్ లో కుర్చోఅని గౌతమ్ కు రోమియో జూలియట్ బుక్ ఇ‌వ్వకుండానే పంపిస్తాడు.

జగతి-మహేంద్ర

జగతి-మహేంద్రని చూసి వాళ్ల క్యాబిన్లోకి వెళతాడు గౌతమ్. రిషి ఎక్కడ అని మహేంద్ర అడగడంతో క్లాస్ తీసుకుంటున్నాడని చెబుతాడు గౌతమ్. మీకా స్టూడెంట్స్ కా అని మహేంద్ర అంటే.. నన్ను కూడా స్టూడెంట్ లా చూస్తున్నాడు ఏంటి అంకుల్ అంటాడు. మంచిదే కదా..కాలేజ్ ఫీజ్ అడుగుతాడామో అంటాడు మహేంద్ర. నాకేం నవ్వు రాలేదు.. రిషితో నేను పడలేకపోతున్నా..తనతో మీరు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారో తెలీదు..ఓ పట్టాన అర్థంకాడు అంటాడు గౌతమ్. నా సుపుత్రుడు ఎప్పుడెలా ఉంటాడో నాకే అర్థం కాలేదు.. నీకెలా తెలుస్తుంది గౌతమ్ అంటాడు మహేంద్ర. ఇంట్లో ఒకలా, కార్లో ఒకలా, కాలేజీలో ఇంకోలా..ఇలా అయితే ఎలా..అప్పుడే ప్రేమ చూపిస్తాడు..అప్పుడే సీరియస్ అవుతాడు అంటాడు గౌతమ్. ఇంతలో మధ్యలో మాట్లాడిన జగతి.. ఇక్కడ లేని ఎండీగారి గురించి మాట్లాడటం సభ్యత కాదేమో అనడంతో.. కరెక్ట్ మేడమ్..రోమియో జూలియట్ ను విడగొట్టాడు వెదవ అని చిన్నగా అనుకుంటాడు. మహేంద్ర ఏంటి రోమియో జూలియట్ అంటే..అదో పెద్ద కథలే అని వెళ్లిపోతాడు. గౌతమ్ తీరు చూస్తుంటే రిషికి కొత్త తలనొప్పి పెట్టేలా ఉన్నాడన్న జగతితో.. రిషికి తనకు తానే పెద్ద తలనొప్పి అంటాడు మహేంద్ర. నా కొడుకుని విమర్శించొద్దు..సమస్యకి పరిష్కారం చూడాలి అంటుంది జగతి. తన మనసులో ఏముందో తెలియదు..వాడు చెప్పడు అంటాడు మహేంద్ర.. రిషి మనసు తెలుసుకోవడం బాధ్యత అనిపించలేదా అని నిలదీస్తుంది. మహేంద్ర నువ్వు నన్ను తిట్టాలని డిసైడ్ అయ్యావ్ కదా..తిట్టే అంటాడు. మహేంద్ర మనసులో ఈ గౌతమ్ ని వాడుకుని..రిషీ మనసులో ఏముందో బయటపెట్టేయొచ్చు కదా అనుకుంటాడు.
 చేతిలో రోమియో, జూలియట్ బుక్ తోనే క్లాస్ కి వస్తాడు రిషి. చేతిలో రోమియో జూలియట్ బుక్ చూపిస్తూ..ఈ రోజు మనం చెప్పుకోబోయే అంశం అని మాట్లాడతాడు. అందరూ షాకై చూస్తారు. అంతా వింతగా చూస్తుండడం గుర్తించిన రిషి చేతిలో బుక్ చూసుకుని… ఓహో రోమియో జూలియట్ బుక్ పట్టుకొని లెసెన్ చెప్తున్నా అని అలా చూస్తున్నారా..ఇదే లెసెన్ గా చేద్దా ఈరోజు అని..కాలేజీ యానివర్శిరీలో దీన్ని నాటకంగా ప్లే చేద్దాం అనుకుంటున్నా అని కవర్ చేస్తాడు. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అంటే..వసుధార చేయి పైకి లేపుతుంది. రిషీ వసుధార తప్ప అంటాడు. ఒక అమ్మయి లేచి యానివర్శిటీకి ఇంకా టైం ఉందికదా అంటే..ప్రపంచ సాహిత్యాన్ని అందరూ తెలుసుకోవాలి అంటాడు. వసుధారని పిలుస్తాడు. వసు మనసులో మళ్లీ ఏం కొంప మునిగిందో నన్ను పిలుస్తాను అనుకోని వెళ్తుంది. ఇది నీకోసం అని బుక్ ఇస్తాడు. ఇంతలో ఒక అబ్బాయి లేచి మన భాషను పక్కన పెట్టి ఇంగ్లీష్ నోవెల్ చదవటమేంటి సార్ అంటే..రిషీ నైస్ గా..ఈ ప్రశ్నకు సమాధానం వసుధార చెప్తుంది అని వసూమీదకు నెడతాడు. వసూ మనసులో..మీరు చెప్పలేక నాకు చెప్పారా అని..ఏదో చెప్పి కవర్ చేస్తుంది.
కట్ చేస్తే కాలేజీలో మెట్లపై కూర్చుని రిషీ ఇచ్చిన బుక్ ఓపెన్ చేసిన వసుధార..సర్ నాకెందుకు ఇచ్చారో అనుకుంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన రిషి..ప్రేమంటే ఏంటో అర్థమైందా అని అడుగుతాడు. వసూ షాకై చూస్తుంది. అదే ఆ బుక్ లో అంటాడు. ఇంకా చదవలేదు అన్న వసుతో..చదవమనే కదా ఇచ్చింది..చదివి చెప్పు అంటాడు. ఇంగ్లీష్ నాటకాలు కన్నా తెలుగు నాటకాలు గొప్పవి ఉన్నవి కదా అంటుంది. రోమియే జూలియట్ స్పెషల్ గా చేయటానికి కారణం ఏంటంటే అని చెప్పబోతాడు..అప్పుడే గౌతమ్ వచ్చి..రోమియో-జూలియట్, దేవదాసు-పార్వతి, లైలా-మజ్ను, సలీమ్-అనార్కలి వీళ్లందరిలో కామన్ విషయం ఏంటో తెలుసా ‘ప్రేమ’ అంటాడు గౌతమ్. ఏంట్రా నీగోల అన్న రిషితో..ఇదేం లైబ్రరీ కాదంటాడు గౌతమ్. ఇదొక విశాలమైన కాలేజ్ గ్రౌండ్..ఏదైనా మాట్లాడొచ్చు..ఎంత గట్టిగా అయినా మాట్లాడొచ్చు అని..నువ్వు ఈ బుక్ చదవలేదా అని వసుధార అడుగుతాడు గౌతమ్..వసూ చదవలేదనడంతో.. ఈ బుక్ ని నేను పాతికముప్పై సార్లు చదివి ఉంటా అంటాడు. ఎపిసోడ్ ముగిసింది

రేపటి ఎపిసోడ్ లో

వసుధార ఏం చేస్తున్నావ్ అని కాల్ చేస్తాడు రిషి. మొక్కలకి నీళ్లు పడుతున్న వసు..చదువుకుంటున్నా అని చెబుతుంది..ఇంతలో అక్కడకు ఎంట్రీ ఇచ్చిన రిషి సార్ మీరేంటి ఇక్కడ అని వసూ అంటే..కొంచె వాటర్ కావాలని అడుగుతాడు. అదే సమయానికి అక్కడకు వచ్చిన మహేంద్ర …రిషి నువ్వేంటి ఇక్కడ అంటూ..జగతిని పిలిచి వాటర్ కావాలని అడుగుతాడు. జగతి మనసులో తండ్రికొడుకులు సడన్గా వచ్చి వాటర్ అడుగుతున్నారేంటి అనుకుంటాడు. అప్పుడే వచ్చిన గౌతమ్.వసూతో మాట్లాడదాం అనుకుంటే..అందరూ ఇక్కడే ఉన్నారేంటి అనుకుని కాస్త షాక్ అవుతాడు. మహేంద్ర ఏంటి గౌతమ్ నువ్వేంటి ఇక్కడ అంటే.. గౌతమ్..మేడమ్   మీరు ఏం అనుకోకపోతే అంటాడు. జగతి నీక్కూడా వాటర్ కావాలా అంటుంది. చూస్తుంటే రేపటి ఎపిసోడ్ పిచ్చ కామేడిగా ఉండబోతుందిగా..
                                                                                         -Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version