మోదీ సర్కారు తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది : గుత్తా సుఖేందర్‌రెడ్డి

-

మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి. తాజాగా ఆయన మాట్లాడుతూ.. రాష్ర్టాభివృద్ధిని చూసి ఓర్వలేకే కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. అభివృద్ధ్దిలో నంబర్‌ వన్‌గా దూసుకుపోతున్న తెలంగాణకు సీఎం కేసీఆర్‌ నాయకత్వమే శ్రీరామ రక్ష అని వ్యాఖ్యానించారు గుత్తా సుఖేందర్‌రెడ్డి. రాష్ర్టాభివృద్ధ్దిని అడ్డుకొనేందుకే కేంద్రం అనేక కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు గుత్తా సుఖేందర్‌రెడ్డి. ఉపాధి హామీ పథకంపై 45 బృందాలతో తనిఖీలు చేయడం అందులో భాగమేనన్నారు గుత్తా సుఖేందర్‌రెడ్డి. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అమ్మకానికి పెట్టడమే అభివృద్ధా? అని గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నించారు. దేశం గుజరాత్‌ వ్యాపారుల చేతుల్లోకి వెళ్తున్నదని, ఇది ఫెడరల్‌ వ్యవస్థకు మంచిది కాదన్నారు గుత్తా సుఖేందర్‌రెడ్డి. తెలంగాణలో అధికారంలోకి వస్తామనుకుంటున్న జాతీయ పార్టీలకు పగటి కలగానే మిగులుతుందన్నారు గుత్తా సుఖేందర్‌రెడ్డి.

మునుగోడు నియోజకవర్గంలో డిండి ఎత్తిపోతల పథకం ద్వారా చర్లగూడెం రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టడంతోపాటు ఫ్లోరైడ్‌కు చెక్‌ పెట్టినట్టు తెలిపారు గుత్తా సుఖేందర్‌రెడ్డి. ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధ్ది జరుగుతుంటే మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బలుపుతో ఉప ఎన్నిక వస్తున్నదన్నారు. రాజగోపాల్‌రెడ్డి వ్యక్తిగత అవసరాలతో ముడిపెడుతూ బీజేపీ ఈ బలవంతపు ఉప ఎన్నికకు కారణమైందని గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికల్లో మునుగోడు ప్రజలు టీఆర్‌ఎస్‌ పక్షాన నిలుస్తారని, బీజేపీకి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 20న మునుగోడులో నిర్వహించే ప్రజాదీవెన సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు గుత్తా సుఖేందర్‌రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version