రోజూ జిమ్ కు వెళ్లే వారు గుండెపోటుకు ఎందుకు గురవుతున్నారు…? ప్రముఖ కార్డియాలజిస్ట్ సమాధానాలు

-

సిక్స్ ప్యాక్స్ దేహం, కండలు మెలితిరిగి శరీరాలు, యవ్వనంగా కనిపిస్తూ రోజూ జిమ్ కు వెళ్లి ఎక్సర్ సైజ్ చేస్తే ఫిట్ గా ఉంటామనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. అయితే ఇటీవల జిమ్ చేస్తూ గుండెపోటులో మరణించిన వారిని చూస్తే మన అభిప్రాయం తప్పని మారుతుంది. తాజాగా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జిమ్ చేస్తూ 46 ఏళ్లలో హఠాత్తుగా మరణించారు. ఇదే తొలి సంఘటన కాదు.

 

గతంలో కూడా పలువురు సెలబ్రిటీలు వ్యాయామాలు చేస్తూ మరణించారు. గత నెలలో బాలీవుడ్ నటుడు సిద్దార్ధ్ శుక్లా( 41), గతంలో కన్నడ నటుడు చిరంజీవి సర్జా(36) హార్ట్ ఎటాక్ తో మరణించారు. ఈ అంశంపై ప్రముఖ కార్డియాలజిస్ట్, పద్మభూషన్ అవార్డ్ గ్రహీత, ఆసియా హార్ట్ ఇనిస్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ డా. రమాకాంత్ పాండా సమాధానం ఇచ్చారు.

మనం చేసే వ్యాయామ విధానం వల్ల మంచి చెడులు ఉంటాయని వెల్లడించారు. 20-25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల లోపు ఉన్న వారిలో 6 నెలలకు ఒకసారి గుండె పోటు కేసును చూసేవారమని, ప్రస్తుతం ప్రతీ వారం ఇలాంటి కేసులు నమోదవుతున్నాయన్నారు. వర్క్ అవుట్స్ అనేవి సాధారణంగానే ఉండాలని, ఎక్కువైనా..తక్కువైనా ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. విపరీతమైన వర్క్ అవుట్ గుండెకు హాని కలిగిస్తాయని వెల్లడించారు. వ్యాయామానికి ముందు మూడు స్టెప్స్ పాటించడం వల్ల గుండెపోటును నివారించవచ్చని తెలిపారు.

వ్యాయామానికి ముందు 5-10 నిమిషాల వార్మప్, 20-30 నిమిషాల ఎక్సర్సైస్, ఆ తరువాత 5-10 నిమిషాల పాటు శరీరానికి రెస్ట్ ఇవ్వాలని సూచించారు. వ్యాయామం చేసే సమయంలో ఛాతీలో ఎడమవైపు నొప్పి రావడం, కండరాలు, జాయంట్లు నొప్పి రావడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలన్నారు. వ్యాయామం సమయంలో శరీరం ఎలా స్పందిస్తుందో గమనించాలని సూచించాడు. దీంతో పాటు ఫ్యామిలీలో గుండెపోటుకు సంబంధించిన హిస్టరీ ఉంటే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version