విద్యార్థులకు శుభవార్త..ఏపీలో రేపటి నుంచే ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నట్లు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎల్లుండి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. పదవ తరగతి ఫలితాల నుంచే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు.రేపటి నుంచి 18వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు.
ఈ సారి.. ఆరు పేపర్లే ఉంటాయన్నారు. ఉదయం 9.30 దాటిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతించబోమని.. ఎవరికైనా వ్యక్తిగతంగా సరైన కారణం అన్నారు. పరీక్షా కేంద్రాల స్కూళ్ళల్లో ఇతర తరగతులు, పనులు జరగవు… బయటి వారు ఎవరూ పరీక్షా కేంద్ర ప్రాంగణంలో పరీక్ష సమయం లో అడుగు పెట్టడం నిషేధం అని వెల్లడించారు.