హార్మోనల్ ఇంజక్షన్ తీసుకున్న హన్సిక.. పుకారుపై క్లారిటీ ఇచ్చిన యాపిల్ బ్యూటీ

-

చైల్డ్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ ప్రారంభించింది యాపిల్ బ్యూటీ హన్సిక. ఆ తర్వాత పదహారేళ్లకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే అప్పట్లో ఈ బ్యూటీపై ఓ విచిత్రమైన పుకారు ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే.. ఈ బ్యూటీ త్వరగా పెరిగేందుకు హార్మోనల్ ఇంజక్షన్ తీసుకుందని. అయితే తాజాగా ఈ పుకారుపై హన్సిక స్పందించింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న లవ్ షాదీ డ్రామా రెండో ఎపిసోడ్ లో యాపిల్ బ్యూటీ ఈ రూమర్ పై క్లారిటీ ఇచ్చింది.

‘సెలబ్రిటీగా ఉండటమంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. నాకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చాలా మంది నా గురించి చెత్తవాగుడు వాగారు. నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతోందనుకుంటా. చాలా మంది నేను త్వరగా పెరిగేందుకు హార్మోనల్‌ ఇంజక్షన్ తీసుకున్నా అంటూ రాసుకొచ్చారు. ఎనిమిదేళ్ల వయసులోనే నేను నటిని అయ్యాను. అందుకని మా అమ్మ నాకు హార్మోనల్‌ ఇంజక్షన్ ఇచ్చి నన్ను త్వరగా పెద్దదాన్ని చేసిందని మాట్లాడుకున్నారు. అది నిజమని ఎలా అనుకుంటున్నారు..?’ అంటూ హన్సిక ఆగ్రహం వ్యక్తం చేసింది.

హన్సిక తల్లి మోనా మాట్లాడుతూ.. ‘నేను నిజంగా హన్సికకు ఇంజక్షన్ ఇచ్చి పెంచి ఉంటే టాటా, బిర్లా కంటే ధనవంతురాలిని అయ్యే దాన్ని. ప్రతి ఒక్కరు త్వరగా పెరిగేందుకు నా దగ్గరికే వచ్చేవారు కదా.. ఇలాంటి పుకార్లు క్రియేట్ చేసేముందు కనీసం కామన్ సెన్స్ ఉండాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version