హోళీ శుభాకాంక్షలు: కొటేషన్లు, వాట్సాప్ సందేశాలు..

-

హోళీ పండగ మన జీవితాల్లోకి సంబరాన్ని తీసుకువచ్చింది. స్తబ్దుగా ఉన్న జీవితాలని రంగులతో తట్టి లేపుతున్నట్టు వివిధ రకాల రంగుల్లో ముంచెత్తుతుంది. కరోనా కారణంగా అందరిలోనూ ఒకరకమైన నిరాసక్తత ఆవరించింది. ఆ అనాసక్తిని రంగులన్నీ కలిసి పోగొట్టాలని అందరూ కోరుకుంటున్నారు. ఒక్కో రంగుకి ఉన్న ప్రాముఖ్యత మనలోకి తెచ్చుకుంటూ రంగుల హోళీని ఆనందాన్ని జరుపుకోవాలి. మహమ్మారి కారణంగా హోళీ పండగకి కూడా నిబంధనలు ఉన్నాయి. వాటిని పాటిస్తూనే మనకు కావాల్సిన వారికి, మనం దగ్గర కావాలనుకున్న వారికి మరింత దగ్గర అయ్యేందుకు రంగుల ద్వారా మెసేజ్ పంపిద్దాం.

ఒకరికొకరు హోళీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ కొటేషన్లు పంచుకోండి.

“భగవంతుడే ఈ రంగులన్నీ ఇచ్చాడేమో! స్నేహం రంగు, ప్రేమ రంగు, ఆనందం రంగు.. ఇలా ఇంకా మిగిలిన రంగులన్నింటినీ జీవితంలో కావాల్సిన చోట వేసుకునేందుకే ఈ రంగులన్నింటినీ సృష్టించాడేమో”!

“అందమైన బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి హోళీ పండగని మించినది మరేది లేదు”.

” ఈ పండగ పర్వదినాన నీ జీవితమనే కాన్వాసు కాగితంపై ప్రపంచంలోని అందమైన రంగులన్నీ కలిసి సరికొత్త పెయింటింగ్ ని వేయాలని కోరుకుంటూ- హోళీ శుభాకాంక్షలు”.

“ఎరుపు రంగుతో ప్రేమనీ, గులాబీ రంగుతో స్నేహాన్నీ, పసుపు రంగుతో తెలివినీ, కొత్త కొత్త ఆశలని ఆకుపచ్చ రంగుతో పంపిస్తున్నాను- హోళీ శుభాకాంక్షలు”

” ఈ రంగుల పండగ రోజు నేను నీకెంత దూరంలో ఉన్నప్పటికీ నా తలపులో నీ ఆలోచన నువ్వు నా దగ్గరే ఉన్నావన్న భావన ఈ పండగ సంతోషాన్ని నా దగ్గరే ఉంచేలా చేసింది. హోళీ శుభాకాంక్షలు”

Read more RELATED
Recommended to you

Latest news