మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో టీచర్ల జీతాల చెల్లింపులో ఆలస్యం కావడంపై క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులను ఆపడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు మంత్రి హరీశ్ రావు. కేంద్ర ప్రభుత్వం వల్లే జీతాల చెల్లింపులో ఆలస్యం అవుతోందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నారని అన్నారు మంత్రి హరీశ్ రావు.
ఉద్యోగుల సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. విద్యాశాఖలో ఉన్న ఖాళీలన్నింటినీ త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు మంత్రి హరీశ్ రావు. రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతోందని విమర్శించారు మంత్రి హరీశ్ రావు. ఆర్థికంగా చాలా ఇబ్బంది పెడుతోందని అన్నారు మంత్రి హరీశ్ రావు. 15వ ఆర్థిక సంఘం చెప్పిన రూ. 5 వేల కోట్లను కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని మంత్రి హరీశ్ రావు చెప్పారు. దేశంలోనే ఎక్కువ వేతనాలు అందుకుంటున్నది తెలంగాణ ఉపాధ్యాయులని… వారి జీతాల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని అన్నారు మంత్రి హరీశ్ రావు.