హస్తం పార్టీలో ఉన్న నలుగురు నాలుగు దిక్కులుగా విడిపోయారు : హరీష్‌ రావు

-

కాంగ్రెస్‌ పార్టీపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ లాంటిదని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. హస్తం పార్టీలో ఉన్న నలుగురు నాలుగు దిక్కులుగా విడిపోయారన్నారు మంత్రి హరీష్ రావు. ఉమ్మడి మెదక్ లోని 10 నియోజకవర్గాల్లో ఎగిరేది గులాబీ జెండా మాత్రమే అన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డికి వైద్య కళాశాల, నర్సింగ్ కాళాశాల తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు మంత్రి హరీష్ రావు. సంగమేశ్వర,బసవేశ్వర ప్రాజెక్టు ద్వారా తొందరలోనే సంగారెడ్డికి గోదావరి జలాలు వస్తాయని, గెలిచినా.. ఓడినా ప్రజల మధ్య సేవకునిగా చింతా ప్రభాకర్ పనిచేస్తారని మంత్రి హరీష్ రావు చెప్పారు.

సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు చింతా ప్రభాకర్ అని కొనియాడారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అందుబాటులో ఉండే పార్టీ బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు. సిద్దిపేట జిల్లా సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం తొగిర్ పల్లి కాంగ్రెస్ పార్టీ కి చెందిన దాదాపు వంద మంది కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్ ఎస్ లో జాయిన్ అయ్యారు.సిద్దిపేటలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్‌లోకి మంత్రి హరీష్ రావు ఆహ్వానించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news