కబ్జాల కోసమే వికేంద్రీకరణ : యనమల

-

మరోసారి వైసీపీపై విమర్శలు గుప్పించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీపై జగన్ రెడ్డి, వైసీపీ నేతలు భయాందోళనలకు గురవుతున్నారని, వారు చేస్తున్న కువిమర్శలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబును పవన్ కలవడంతో వారు అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు యనమల. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతీయ పార్టీలు మఖలో పుట్టి, పుబ్బలో కనుమరుగయ్యాయని, ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నందునే తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లుగా విరాజిల్లుతోందని యనమల తెలిపారు. 2024 ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం 1983 నాటికంటే ఘనంగా ఉంటుందని జగన్ రెడ్డి, ఆయన ప్రభుత్వానికి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు యనమల.

“జగన్మోహన్ రెడ్డి తన ఆస్తులు పెంచుకోవడానికి, కబ్జాల కోసమే వికేంద్రీకరణ అంటున్నాడు గానీ, ప్రజల కోసం కాదు. టీడీపీ మాండలిక విధానంతో పరిపాలన వికేంద్రీకరణకు అంకురార్పణ చేసింది. బీసీలకు తొలిసారి 20 శాతం రిజర్వేషన్లు, మహిళలకు తొలిసారి 9 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ దే. పవన్ కల్యాణ్ పార్టీ యాక్టివ్ గా ఉంది. ఆయన నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఏ పార్టీ అయినా ప్రజాక్షేత్రంలో నిలవాలంటే, ఎప్పటికప్పుడు యువతరం ఆలోచనలకు తగినట్టుగా మార్పు చెందాలి. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లపాటు కొనసాగిందంటే, దానికి కారణం ఎన్టీఆర్, చంద్రబాబుపై ప్రజలు చూపిన విశ్వసనీయతే.

Read more RELATED
Recommended to you

Latest news