నా ప్రాణం ఉన్నంత వరకూ సిద్ధిపేటకు సేవ చేస్తా – హరీష్ రావు

-

సిద్ధిపేట ప్రజలకు సేవ చేయడం నా అదృష్టం. నా కుటుంబం ఎట్లనో.. సిద్ధిపేట ప్రజలు కూడా అంతే. నా ప్రాణం ఉన్నంత వరకూ సిద్ధిపేటకు సేవ చేస్తానని పేర్కొన్నారు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కొండా భూదేవి గార్డెన్స్ లో జరిగిన భవన నిర్మాణ కార్మికుల జిల్లా సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మాట్లాడారు.

సిద్ధిపేట కార్మిక బీమా కోసం రూ.110 రూపాయలు స్వయంగా తానే చెల్లింపు చేస్తానని వెల్లడించారు. సిద్ధిపేట భవన నిర్మాణ కార్మికుల వెసులు బాటుకై క్యాంపు కార్యాలయంలో పీఏను ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తానని మంత్రి భరోసా కల్పించారు.

తన ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.30 లక్షలు వెచ్చించి భవన నిర్మాణ కార్మికులకు శాశ్వత భవన నిర్మాణం చేపడతామని.. సిద్ధిపేటలో జరిగే ప్రతీ అభివృద్ధి నిర్మాణంలో మీకు సరైన అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకై టీఆర్ఎస్ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని గత బడ్జెట్ లో ప్రక్రటించిందని.. మొదటి విడతగా లక్ష మందికి సబ్సిడీ పై మోటార్ సైకిళ్లను అందివ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని వెల్లడించారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news