హరీష్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు – ఎంపీ లక్ష్మణ్

-

మంత్రి హరీష్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు బిజెపి రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్. చేనేత కార్మికుల గురించి టిఆర్ఎస్ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఎన్నికల కోసమే జీఎస్టీ మాట తీసుకువచ్చారని.. 5% జిఎస్టి అడిగింది మీరేనని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని అన్నారు లక్ష్మణ్. కాంగ్రెస్ లో ఉన్నప్పుడే రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టులు చేయలేదా? అని ప్రశ్నించారు.

ఉగ్ర మూలాలు, అవినీతి మూలాలు హైదరాబాదులోనే ఉంటున్నాయన్నారు. 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మీరు కొనలేదా? అని ప్రశ్నించారు. మీకు 83 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇతర ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీ ఫిరాయింపులు దేశంలో ఎక్కడా లేవన్నారు. తాను పదవుల కోసం పార్టీలో చేరలేదని.. సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నానని అన్నారు. బిజెపి గెలిచే అభ్యర్థులను మాత్రమే బరిలో దించుతుందని స్పష్టం చేశారు. సమయం వచ్చినప్పుడు అందరి అవినీతి బయటపడుతుందని.. మేము కూడా నిష్పక్షపాతమైన విచారణని కోరుకుంటున్నామన్నారు లక్ష్మణ్.

Read more RELATED
Recommended to you

Latest news