బిజెపి అంటే ..బుల్డోజర్ జనతా పార్టీ : మంత్రి హరీష్ రావు

-

బిజెపి అంటే …బుల్డోజర్ జనతా పార్టీ అని ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. కేంద్రంలో పనిచేసే ఆర్ధిక వేత్తలు మధ్యలోనే పారిపోతున్నారుని ఎద్దేవా చేశారు. ఆసరా పెన్షన్లలో కూడా కేంద్రం వాటా ఉందా? అని నిలదీశారు. ఆసరా పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వం వాటా 3.4 శాతం మాత్రమే నని.. రాయచూరు లో పెన్షన్ల కింద 6 వందల రూపాయలు మాత్రమే ఇస్తున్నారన్నారు.

బిజెపి పాలిత రాష్ట్రంలో ఎక్కడడైన మూడు వేలు, రెండు వేల రూపాయల పెన్షన్ల ఇస్తున్నారు…ఎక్కడైనా ఇస్తే రాష్ట్రం పేరు చెప్పండి బండి సంజయ్ ? అని ప్రశ్నించారు. ఆర్డీఏస్ పై పోరాటం చేసింది, సమస్య పరిష్కరించింది కేసీఆర్ అన్నారు. అప్పడు రాయలసీమ నాయకులు ఆర్డీఎస్ ను బాంబులు పెట్టి పిలిస్తే…డీకే అరుణ మంత్రిగా మౌనంగా ఉన్నారని నిపులు చెరిగారు.

రాయిచూర్ ప్రజలు వచ్చి తెలంగాణ లో అమలు అవుతున్న పథకాలు కర్ణాటక లో పెట్టమని వినతి పత్రం ఇచ్చారని..  కేంద్రమే గ్రామాలకు నిధులు ఇస్తే దేశంలోని ప్రతి గ్రామంలో నర్సరీలు, వైకుంఠదామలు, ట్రాక్టర్ లు ఉండాలి కదా ? అన్నారు. ఎన్డీఏ సర్కార్ సెస్ ల రూపంలో తీసుకుని రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయంను తగ్గించారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news