మోడీ వచ్చాక ఒక్కటైనా మంచి జరిగిందా? – సీఎం కేసీఆర్

-

నేడు సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటనలో మరోసారి కేంద్రంపై నిప్పులు చెరిగారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే మోడీ ప్రధాని అయ్యాడని.. ఆయన వల్ల ఒక్క మంచి పని అయినా జరిగిందా? అని ప్రశ్నించారు. దేశంలో గోల్మాల్ గోవిందం గాళ్లు ఎక్కువైపోయారన్నారు. అప్రమత్తంగా లేకుంటే మునిగిపోతామని హెచ్చరించారు సీఎం కేసీఆర్.

ప్రధాని మోదీ డైలాగులు బాగా చెప్తారని.. ఇప్పటికీ దీపావళి టపాసులు, జాతీయ జెండాలు, పతంగుల దారాలు చైనా నుంచేనా? మోడీ చెప్పే మేకింగ్ ఇండియా ఇదేనా? అని ప్రశ్నించారు. ఊరూరా చైనా బజార్ లు కనిపిస్తుంటే.. ఇండియా బజార్లు ఎక్కడ? అని ప్రశ్నించారు. బిజెపి పార్టీ ఎనిమిది సంవత్సరాల నుంచి లక్షలాది మంది ఉద్యోగులు ఉన్న ఎల్ఐసి ని అమ్మేస్తాం అంటుందని, కేంద్ర బడ్జెట్ కు సమానంగా ఎల్ఐసి 35 లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉందన్నారు. ప్రజల సొమ్ముని వ్యాపారులకు కట్టబెడతామంటే భారతదేశం పిడికిలి ఎత్తాలన్నారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version