నూనె అంటే పువ్వులతో, కాయలతో తయారు చేస్తారని మనకు తెలుసు..మహా అంటే చేప నూనె గురించి చేస్తారని విన్నాం.. కానీ బాతు నుంచి కూడా ఆయిల్ తీస్తారని మీకు తెలుసా..? బాతు నూనెలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ఆయిల్‌ను తగిన పరిమాణంలో తీసుకుంటేనే ఈ లాభాలను పొందవచ్చు. ఇంతకీ ఆయిల్ ఎలా చేస్తారు..? ఉపయోగం ఏంటో చూద్దామా..!
బాతులోని పిట్యూటరీ గ్రంధి ఉత్పత్తి చేసే నూనె ఇది. దీన్ని డాగేస్తాన్లోని మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న ఓ జాతికి చెందిన మహిళలు బాతు మెడ నుంచి మసాజ్ పద్ధతిలో నూనెను బయటికి తీస్తారు. ఈ పని అందరూ చేయలేరట. డాగేస్తాన్ అనేది రష్యాకు దగ్గర్లో ఉండే చిన్న దేశం. ఇది చాలా ఖరీదైనది.. ఆహారంలో ఈ నూనెను రోజుకు ఒకటి లేదా రెండు స్పూనులు కలుపుకుని తింటే చాలా మంచిది.
గుండెకు మేలు..
బాతు నూనెలో మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ అధికంగా లభిస్తుంది. ఇది గుండెకు ఎంతో మేలు చేస్తుంది. గుండె పోటు, స్ట్రోక్ వంటి గుండె సంబంధ వ్యాధులను రాకుండా అడ్డుకుంటుందట.
కొలెస్ట్రాల్ తగ్గుతుంది
బాతునూనె క్రమ పద్ధతిలో రోజూ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక రక్తపోటు ఉన్న వారికి బాతు నూనె చాలా మేలు చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
బోలెడు యాంటీ ఆక్సిడెంట్లు..
బాతు నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరరీంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. మీ ఆహారంలో బాతు నూనెను క్రమం తప్పకుండా కలిపి తినడం వల్ల ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కిడ్నీ ఆరోగ్యానికి
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడడంలో బాతు నూనె చాలా మేలు చేస్తుంది. ఈ బాతు నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు, లినోలిక్ ఆమ్లం మీ కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుతుందని నిపుణులు అంటున్నారు
రోగనిరోధక శక్తి..
ఈ నూనె వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల టాక్సిన్లు నుంచి రక్షణ దక్కుతుంది. ఈ నూనెలో జింక్, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఈరోజుల్లో రోగనిరోధక శక్తి ఎంత అవసరమో మనందరికి తెలిసిన విషయమే.!
మంచి కొవ్వులు
ఇతర జీవులతో పోలిస్తే ఆరోగ్యకరమైన కొవ్వులు దీనిలో ఎక్కువగా ఉంటాయి. అందుకే గుండె సంబంధిత రోగాలు త్వరగా దాడిచేయవు. అలాగే గుండె సమస్యలతో బాధపడేవారికి ఈ నూనె చాలా మేలు చేస్తుందట.
ఎముకలకు మేలు
ఎముకలను బలోపేతం చేయడంలో ఈ నూనె అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే లినోలిక్ ఆమ్లం కాల్షియం శోషణను పెంచుతుంది. దీని వల్ల ఎముకలు బలంగా మారుతాయి. అందుకే కనీసం రోజుకు ఒక స్పూను బాతునూనైనా తింటే మంచిది.
ఇలా బాతు నూనె వల్ల ఈరోజుల్లో అధికంగా ఉండే సమస్యలన్నీంటికి పరిష్కారం దొరికినట్లవుతుంది. అయితే ఆ ఆయిల్‌ను ఎంపిక చేసుకోవడం, వాడే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.!