HBD: రామ్ చరణ్ ఎన్ని వందల కోట్లకు ఆస్తిపరుడో తెలుసా..?

-

మెగాస్టార్ వారసుడిగా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈయన తన తండ్రి గర్వించేలా గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయారు. దీన్ని బట్టి చూస్తే రామ్ చరణ్ తన నటన విధానంలో ఏ విధంగా మార్పులు చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆయన నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో రామ్ చరణ్ క్రేజ్ కూడా భారీగా పెరిగిపోయింది. మరొకవైపు హాలీవుడ్ లో కూడా రామ్ చరణ్ కు అవకాశాలు వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈరోజు ఆయన తన 38వ పుట్టినరోజును అభిమానులు, కుటుంబ సభ్యుల మధ్య చాలా ఘనంగా జరుపుకోనున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

ఒకవైపు హీరోగా చేస్తూనే మరొకవైపు తన తండ్రి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాకి కొణిదెలా ప్రొడక్షన్స్ స్థాపించి ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ అయ్యారు. ఇక సినిమాలే కాకుండా కొన్ని ప్రోడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అపోలోజియా, ఫ్రూటీ, వొలానో, పెప్సీ, టాటా డొకోమో , హీరో మోటో క్రాప్ వంటి దాదాపు 33 గ్రాండ్లకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఈ యాడ్స్ ద్వారా రామ్ చరణ్ కు నెలకు రూ.4 కోట్ల వరకు ఆదాయం వస్తున్నట్లు సమాచారం. ఆయన గ్లోబల్ స్టార్ గా మారిపోవడంతో ఆయన ఖాతాలో మరికొన్ని బ్రాండ్లు వచ్చి చేరబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇతర ఆస్తిపాస్తులు, వ్యాపారాలు ద్వారా ఆయన 1370 కోట్ల రూపాయలను పోగు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో రూ.38 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన అద్భుతమైన ఇంట్లో ఆయన తన భార్య ఉపాసనతో కలసి ఉంటున్నారు. అలాగే సొంత జెట్ కూడా వీరి సొంతం. మరోవైపు భార్య నుంచి కూడా కొంత ఆస్తి సంక్రమించినట్లు తెలుస్తోంది. అలాగే తన తండ్రి చిరంజీవి సంపాదించిన ఆస్తిలో కూడా ఈయనకు భాగం ఉండనుంది. మొత్తానికైతే రూ.2 వేల కోట్లకు పైగా ప్రాపర్టీకి రామ్ చరణ్ వారసుడు అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version