టవల్‌ కట్టుకోని మెట్రో ఎక్కేశాడు..ఇదెక్కడి చోద్యంరా బాబు.!!

-

సోషల్‌ మీడియాలో ఫేమస్ అవడానికి ఎవరి తిప్పలు వాళ్లు పడుతుంటారు. దానికోసం.. రోటిన్‌కి భిన్నంగా చేస్తుంటారు. మనం కూడా అలాంటి వాళ్లను చాలానే చూసి ఉంటాం. హైలెట్‌ ఏంటంటే.. అలాంటి వాళ్లే త్వరగా ఫేమస్‌ అవుతారు. ఆ వీడియోలకే వేలకొద్ది లైక్స్‌, లక్షల్లో వ్యూస్‌ వస్తాయి. ఇప్పుడు చెప్పుకోబేయే వీడియో కూడా అలాంటిదే.. టవల్‌ మీదే మెట్రోలో ట్రావెల్‌ చేస్తున్నాడు. ఇది తప్పేం కాదు.. ఇంట్లో ఉండాల్సిన గెటప్‌తో బయటకు వస్తే అందరూ అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. టవల్‌ కట్టుకున్న వ్యక్తికి వీడియో తీస్తున్నారన్న సంగతి తెలుసు.. కానీ ఏం తెలియనట్లు..రోటీన్‌గా వచ్చేసినట్లు బిల్డప్‌ ఇస్తున్నాడు.

top

ఓ వ్యక్తి టవల్ కట్టుకుని ఢిల్లీ మెట్రో ఎక్కాడు. అలాగే కంపార్ట్‌మెంట్‌లు అన్నీ తిరిగాడు. ప్యాసింజర్స్‌ అతడిని చూసి ఆశ్చర్య పోయారు. కొందరు నవ్వుకున్నారు. మరి కొందరు “ఇదేం చోద్యం” అన్నట్టుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. కానీ…ఆ యువకుడు మాత్రం అదేదీ పట్టించుకోకుండా టవల్ కట్టుకుని అటు ఇటు తెగ తిరిగాడు. మోహిత్ అనే ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోని పోస్ట్ చేశాడు. ఇప్పటికే 30 లక్షల వ్యూస్ వచ్చాయి. క్యాజువల్‌గా అలా టవల్ చుట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ ఆ యువుకుడు కనిపించాడు. అంతే కాదు. అలాగే నించుని ఫోన్ మాట్లాడాడు. మెట్రో విండోలోని మిర్రర్‌లోకి చూస్తూ క్రాఫ్ సరి చేసుకుంటూ తెగ హడావుడి చేశాడు.

అసలు చుట్టు పక్కల వాళ్లు ఏమనుకుంటారు, నవ్వుతున్నారా లేదా అని ఏం పట్టించుకోలేదు. కొంతమంది ఆ యువకుడిని చూసి తెగ నవ్వుకున్నారు. “ఇంట్లో ట్యాంక్‌లో నీళ్లు అయిపోయాయి. ఇవాళ ఆఫీస్‌కి వెళ్లి స్నానం చేస్తాను” అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశాడు… ఇది చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. “ఇలాంటివి చేయాలంటే గట్స్ ఉండాలి. నీకు సెల్యూట్ బ్రదర్” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఆ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో అన్నీ ఇలాంటి ఫన్నీ వీడియోస్‌ ఉన్నాయి. చూసి తరించండి.!!

Read more RELATED
Recommended to you

Latest news