Breaking : ఏపీలో భారీ ధర పలికిన బార్‌ లైసెన్స్‌లు

-

ఏపీలో జగన్‌ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన బార్‌ లైసెన్సింగ్‌ విధానంతో ఖజానా కలకలలాడుతోంది. బార్ల వేలానికి లెక్కకు మించి స్పందన కనిపించింది. కోట్లల్లో కుమ్మరించి మరీ బార్ల లైసెన్స్‌ పొందేందుకు మద్యం వ్యాపారులు తీవ్రంగా పోటీపడుతున్నారు. బార్ల వేలంలో కడప, తిరుపతి నేతలు హల్‌చల్‌ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ఇవాళ జరిగిన బార్ల వేలంలో పెద్ద ఎత్తున ఆదాయం ప్రభుత్వానికి అందనున్నది. కాగా, ప్రభుత్వ మద్యం పాలసీకి వ్యతిరేకంగా టీడీపీ మహిళా విభాగం విశాఖలో ఆందోళనకు దిగారు. ఏపీలో బార్‌ లైసెన్సులను జారీ చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో వ్యాపారులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు.

AP announces new 2022 bar policy from Sept. 1

 

మద్యం కొత్త లైసెన్సింగ్‌ విధానం ప్రభుత్వ ఖజానాకు సిరులు కురుపిస్తున్నది. ఆన్‌లైన్‌లో బిడ్డింగ్‌ నిర్వహిస్తున్నారు. రికార్డు స్థాయిలో బార్లను వేలానికి పొందుతున్నారు. ఇవాళ జరిగిన వేలంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో బార్ల ఏర్పాటుకు వేలం నిర్వహించారు. ఈ వేలంలో బార్లు దక్కించుకున్నవారికి 2025 వరకు లైసెన్స్‌ అందుబాటులో ఉంటుంది. చాలా చోట్ల రూ.కోటి పైనే ధర పలికాయి. అనంతపురంలో పోటీ తీవ్రంగా ఉన్నది. అటు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో కూడా బార్లకు తీవ్రమైన పోటీ ఉన్నది.

 

తిరుపతిలోని ఓ బార్‌ వేలంకు పెట్టగా.. రూ.1.59 కోట్లు పలకడం విశేషం. ఇక్కడ వైసీపీ నేతలే నువ్వా-నేనా అన్న రీతిలో పోటీపడి బార్లు దక్కించుకున్నారు. ఏపీ ఎక్సైజ్‌ కొత్త బార్‌ లైసెన్సింగ్‌ విధానంతో వందల కోట్ల రూపాయల ఆదాయం కేవలం ఫీజుల రూపంలోనే ప్రభుత్వానికి అందనున్నది. గత పాలసీ ప్రకారం లైసెన్స్‌ ఫీజురూ.44 లక్షలుగా ఉండేది. ప్రస్తుతం ఈ పాలసీలో మార్పులు చేసిన ప్రభుత్వం.. ఎక్కడి నుంచైనా బిడ్డింగ్‌లో పాల్గొనే సదవాకాశాన్ని కల్పించింది. లైసెన్స్‌ ఫీజులను ఎడాపెడా పెంచేసి నాన్‌ రిఫండబుల్‌ విధానాన్ని తీసుకువచ్చింది. పెద్ద సిటీల్లో రూ.60 లక్షలు, 5 లక్షల జనాభా దాటిన మున్సిపాలిటీల్లో రూ.35 లక్షలు, మిగిలన పట్టణాల్లో రూ.15 లక్షలుగా ప్రభుత్వం ఫీజులను నిర్ణయించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news