శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద.. 16 గేట్లు ఎత్తివేత.. ప్రజలకు అధికారుల హెచ్చరికలు

-

తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీనికితోడు ఇటీవల ఎగువన కురిసిన వర్షాలకు తెలంగాణలోని జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. అయితే.. ఉత్తర తెలంగాణకు జీవనాడిగా ఉన్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి 59 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నట్లు ఎస్సారెస్పీ అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1090 అడుగుల వరకు నీరు ఉంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 90 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉందని వివరించారు.

జూరాల జలాశయానికి భారీగా వరద వస్తుందని అధికారులు వివరించారు. ప్రాజెక్టుకు 2.40 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా 43 గేట్లు ఎత్తి 2.51లక్షల 217 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.51 మీటర్లకు 318.130 అడుగుల వరకు నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 9.65 టీఎంసీలకు గాను 8.869 టీఎంసీల నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version