ఏపీలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హిందూపూర్‌లో వరద బీభత్సం సృష్టిస్తోంది. పెన్నా నది ఉగ్రరూపం దాల్చడంతో సమీప ప్రాంతాల వాసులు వణికిపోతున్నాయి. అనంతపురం, కడప జిల్లాల్లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ నుంచి వరద వస్తుండడంతో ఉధృతి పెరుగుతూనే ఉంది. కుట్టమూరు మరువలో ఓ లారీ చిక్కుకుంది. లారీని జెసిబి లతో ఒడ్డున చేర్చేందుకు స్థానికులు ప్రయత్నం చేస్తున్నారు. కొత్తపల్లి మరవ వాగు రోడ్డుకు అడ్డంగా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. హిందూపురం – చిలమత్తూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వాగులు, వంతెనలు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. లేదంటే.. ప్రమాదం బారిన పడక తప్పదు. రోజు వెళ్లే దారే కదా.. ఎప్పుడూ దాటే వాగే కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి అని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే.. ఇదిలా ఉంటే.. మరో మూడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు అధికారులు. తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.