థలపతి విజయ్ 66వ చిత్రంలో విలన్ గా హీరో శ్రీకాంత్ !

-

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం తలపతి 66 లో నటిస్తున్నారు. విజయ్ సరసన ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఇటీవల ప్రముఖ నటులు శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్ మరియు జయసుధ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించడానికి సిద్ధంగా ఉన్నారని మేకర్స్ ప్రకటించారు.అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ మేక కూడా భాగమని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై నిర్మిస్తున్న ఈ బహుభాషా చిత్రంకి తమన్ సంగీతం అందిస్తున్నారు. హీరో శ్రీకాంత్ ఈ చిత్రంలో కన్ఫర్మ్ అవడంతో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో శ్రీకాంత్ అఖండ సినిమా తరహాలో విలన్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news