దయచేసి నన్ను షారుఖాన్ సినిమాలోకి తీసుకోండి.. హీరోయిన్ రిక్వెస్ట్..!

-

దంగల్ సినిమా ద్వారా ఫాతిమా సనా షేక్ ఎంతగానో గుర్తింపు సంపాదించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా పలు సినిమాలతో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే స్వతహాగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ వీరాభిమాని అయిన ఫాతిమా షారుక్ ఖాన్ సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉంటానని షారుక్ ఖాన్ పై తనకున్న అభిమానాన్ని పలు ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకొచ్చింది. ఇటీవలే షారుక్ ఖాన్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

షారుక్ ఖాన్ కొత్త సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు షూటింగ్ జరుపుకుంటుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది ఫాతిమా. అయితే ప్రస్తుతం ఇప్పటికే షారుక్ తో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన రాజ్కుమార్ హిరాని దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ కొత్త సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పాతిమ డైరెక్టర్ రాజ్ కుమార్ కి షారుక్ సినిమాలో అవకాశం ఇవ్వాలి అంటు మెసేజ్ పెట్టిందట. ఇక ఫాతిమా రిక్వెస్ట్ పై దర్శకుడు ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version