ఆసుపత్రిలో హీరోయిన్ శ్రియ భర్త.. వైరల్ అవుతున్న ఫొటో!

-

టాలీవుడ్ అందాల ముద్దు గుమ్మ శ్రియ (Shriya) గురించి తెలియని వారు ఉండరు. అంతలా ఈ బ్యూటీ ప్రేక్షకులను మాయ చేసింది. చిత్ర పరిశ్రమలో ఉన్నన్ని రోజులు తన పరువాలతో కుర్రకారు మతులు పోగొట్టిన ఈ చిన్నది పెళ్లి చేసుకున్నాక కూడా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ.. కుర్రాళ్ల నిద్ర చెడగొడుతుంది. చాలా రోజుల నుంచి టాలీవుడ్‌ సినిమాలు చేయని ఈ బ్యూటీ.. ఇటీవలే “గమనం” అనే సినిమాతో వచ్చింది.

ఇది ఇలా ఉండగా.. తాజాగా తన భర్త ఆస్పత్రిలో ఉన్న ఫోటోను షేర్‌ చేసి.. ఏమోషనల్‌ అయింది శ్రియ. గత కొన్ని రోజులుగా శ్రీయ భర్త హెర్నియాతో బాధ పడుతున్నాడట. దీంతో.. ఇటీవల హైదరాబాద్‌ లోని అపోలోఆస్పత్రిలో ఆయన అడ్మిట్‌ అయ్యారు. ఆయనకు వైద్యులు ఆపరేషన్‌ చేశారు. ఇప్పుడు అతని పరిస్థితి బాగుందని శ్రియా పేర్కొంది. అనారోగ్యంతో.. ఉన్నప్పుడు రాధను కూడా ఎత్తుకునేవాడని.. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి చాలా ఘోరంగా ఉందని తెలిపింది. త్వరలోనే ఆయన కోలుకుని.. ఎప్పటి లాగే ఉంటాడని కూడా ఆశాభావం వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news