కొన్ని రోజుల క్రితం తెలంగాణ గ్రూప్ పరీక్ష పాత్రలు లీక్ అయిన విషయం ఎంత సంచలనంగా మారిందో చూశాము. ప్రస్తుతం గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు జరుగుతుండగా , పరీక్షల కన్నా ముందే జూన్ 11 న జరగనున్న పరీక్షను ఆపి ఈ కేసును సిబిఐకి అప్పగించాలని హై కోర్ట్ లో పిటీషన్ వేయడం జరిగింది. కాగా కొన్ని వాయిదాలు మరియు విచారణల అనంతరం హై కోర్ట్ ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ విషయంలో హై కోర్ట్ జోక్యం చేసుకోవాలని అనుకోవడం లేదంటూ ధర్మసనం ప్రకటించింది. ఇక ఇప్పటికే ఈ పరీక్షను జరపకుండా ఆపాలని వేసిన అన్ని పిటీషన్ లను హై కోర్ట్ కొట్టివేసింది. ఇక షెడ్యూల్ ప్రకారం గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది.
హై కోర్ట్: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో జోక్యం చేసుకోలేము…
-