సినిమాలు ఫ్లాప్ అయినా విజయ్ దేవరకొండ క్రేజ్ మాములుగా లేదుగా….!!

-

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ముందుగా అక్కడక్కడా చిన్న చిన్న పాత్రల్లో నటించిన యువ హీరో విజయ్ దేవరకొండ, ఆ తరువాత కొద్దిరోజులకు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారాడు. అయితే హీరోగా నటించిన ఫస్ట్ సినిమానే ఆయనకు మంచి హిట్ ని అందించడం, అలానే ఆపై వచ్చిన అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలు కూడా సూపర్ హిట్స్ కొట్టి విజయ్ క్రేజ్ ని అమాంతం పెంచేయడంతో పాటు ఆయనకు స్టార్ హీరోగా మంచి పేరుని తెచ్చిపెట్టాయి.

ఇక గీత గోవిందం తరువాత మొన్నటి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా వరకు కూడా విజయ్ నటించిన సినిమాలేవీ కూడా పెద్దగా సక్సెస్ కానప్పటికీ ఆయన క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గడం లేదు అనే చెప్పాలి. ఇక వరుసగా ఆయనకు మంచి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇక ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే పాన్ ఇండియా మూవీలో హీరోగా నటిస్తున్న విజయ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ చెప్పడానికి నిదర్శనంగా ఆయన అభిమాని ఒకరు,

 

నేడు ఏకంగా తన కార్ నెంబర్ ప్లేట్ మీద ఐ లవ్ రౌడీ హీరో అని వేయించుకోవడం జరిగింది. కాగా కాసేపటి క్రితం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆ కార్ ఫోటో విపరీతంగా వైరల్ అవుతుండడంతో దానిపై విజయ్ ఫ్యాన్స్ సంతోషంతో దానిని మరింత షేర్స్, లైక్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. మరి ఇటీవల వరుసగా అపజయాలు అందుకుంటున్న విజయ్, ప్రస్తుతం నటిస్తున్న ఫైటర్ తో ఎంత మేర సక్సెస్ ని అందుకుంటాడో చూడాలి….!!

Read more RELATED
Recommended to you

Latest news