బిజినెస్ ఐడియా: తక్కువ పెట్టుబడి తో కళ్ళు చెదిరే లాభాలు వచ్చే వ్యాపారం..

-

ప్రస్తుతం యువత బిజినెస్ వైపు మొగ్గు చూపుతున్నారు..కొత్త బిజినెస్ లు చేస్తూ లక్షల ఆదాయాన్ని పొందుతున్నారు..తెలియని వాటి కన్నా కూడా తెలిసిన వాటిపై పెట్టుబడి పెట్టి మంచి లాభాలను పొందవచ్చు.. అలాంటి వాటిలో సీజనల్ వ్యాపారం బెస్ట్.ఈ సీజన్ కు ఐస్ క్రీమ్ పార్లర్ బిజినెస్. ముఖ్యంగా వేసవి రోజులలో ఈ వ్యపారానికి డిమాండ్ చాలా పెరుగుతుందని తెలుసుకోవాలి. దీన్ని ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడి విషయానికొస్తే, మీరు 10-20 వేల రూపాయల సాధారణ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు..

 

లాభాలు పెరిగే కొద్ది వ్యాపారాన్ని కూడా పెంచుకొవచ్చు.. దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ ఈ వ్యాపారం సాగుతోంది. అయినప్పటికీ.. ఈ వ్యాపారాన్ని ఎక్కడైనా ప్రారంభించడానికి అవకాశం ఉంది. మీరు 300-400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐస్ క్రీమ్ పార్లర్‌ను ప్రారంభింవచవచ్చు. ఇందులో 5-10 మందికి సీటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు.మామూలు తోపుడు బండి పెడితే ఎటువంటి పరిమిషన్లు అవసరం లేదు.కానీ చిన్న పార్లర్ పెడితే మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి అనుమతి తెచ్చుకోవాలి.

ఇది 15 అంకెల రిజిస్ట్రేషన్ నంబర్. మీ స్థలంలో తయారుచేసిన ఆహార పదార్థాలు దాని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని ఇది నిర్ధారిస్తుంది. మీరు అమూల్ ఐస్ క్రీమ్ పార్లర్‌ను ఫ్రాంఛైజింగ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇందుకోసం కనీసం 300 చదరపు అడుగుల స్థలం కావాలి. ఐస్ క్రీం వ్యాపారంలో లాభాలు మీరు తయారు చేయడానికి ఎలాంటి పదార్థాలను ఉపయోగిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది..అక్కడ క్లియర్ అయితే మీరు బిజినెస్ పై ఫోకస్ పెట్టవచ్చు..చిన్న పిల్లలకు ఇష్ట మైన వాటిని తయారు చేస్తే మాత్రం డిమాండ్ పెరుగుతుంది.. ఈ ఆలోచన ఉంటే ఇప్పుడే మొదలు పెట్టండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version