దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అందులో కొంత మంది కర్రాళ్లతో శాస్త్రి పార్క్ ఫ్లై ఓవర్ కింద ఉన్న వారి వద్దకు వెళ్లి.. మీరు బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వచ్చారు అంటూ వారిపై దాడి చేశారు. దీంతో మైగ్రెంట్స్ భద్రతపై ఆందోళన అనేది మొదలయ్యింది.
అయితే దాడి హిందూ రక్షా దళ్ అధ్యక్షుడు అయిన పింకీ చౌదరి చేయించాడు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులకు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ప్రధాన సాక్ష్యంగా.. కోర్టులో కీలకంగా మారనుంది. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది అందరికి తెలిసిందే. ముఖ్యంగా అక్కడ హిందువుల పై నిరసనకారులు దాడులకు పాల్పడుతున్నారు. దాంతో చాల మంది బంగ్లాదేశీయులు రక్షణ కోసం ఇండియాలోకి వస్తున్నారు.