మైనర్‌ బాలిక అత్యాచారం కేసు స్పందించిన హోంమంత్రి

-

హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో బాలిక అత్యాచార ఘ‌ట‌న‌లో నిందితుల‌ను క‌చ్చితంగా క‌ఠినంగా శిక్షిస్తామ‌ని రాష్ట్ర హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ స్ప‌ష్టంచేశారు. హోదాతో సంబంధంలేకుండా నిందితుల‌ను శిక్షించాల‌ని మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌పై మ‌హ‌మూద్ అలీ స్పందించారు. ఇది దారుణ‌మైన ఘ‌ట‌న అని మ‌హ‌మూద్ అలీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తంచేశారు. నిందితులు ఎంత‌టివారైనా ఉపేక్షించ‌బోమ‌న్నారు. వారి నేప‌థ్యంతో సంబంధం లేకుండా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టంచేశారు.

నిందితుల‌ను వీలైనంత త్వ‌ర‌గా అరెస్టు చేయాల‌ని ఇప్ప‌టికే పోలీసుల‌కు ఆదేశాలు జారీచేశామ‌న్నారు. పోలీసులు ద‌ర్యాప్తు వేగ‌వంతం చేసిన‌ట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ బీజేపీ శ్రేణులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో బీజేపీ శ్రేణులు పోలీస్ స్టేష‌న్‌లోకి దూసుకెళ్లడంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version