ఏ వయస్సు వారు ఎంతసేపు నిద్రపోతే మంచిది.. మరి మీ వయస్సుకి..?

-

ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో మంచి నిద్ర కూడా అంతే ముఖ్యం. ఈరోజుల్లో చాలా మంది రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. కొంత మందికి అయితే రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టదు. కానీ ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. మంచి నిద్ర ని పొందితే ఆరోగ్యం కూడా బాగుంటుంది. వయసును బట్టి నిద్రపోవడం చాలా ముఖ్యం. చాలా మందికి ఈ విషయం తెలీదు. మరి మీ వయసును బట్టి మీరు ఎంత సేపు నిద్రపోవాలి అనే విషయాన్ని చూద్దాం.

నవజాత శిశువు మూడు నెలల వరకు కూడా 14 నుండి 17 గంటల పాటు నిద్రపోవాలి. అప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. శిశువు మూడు నుండి ఆరు నెలల శిశువులు 12 నుండి 15 గంటల పాటు నిద్రపోవాలి. రెండేళ్ల లోపు పిల్లలు 11 నుండి 14 గంటల సేపు నిద్రపోవాలి ఆరోగ్యంగా ఉంటారు. ఇక ఐదేళ్ల పిల్లలైతే ఐదేళ్ల లోపు రోజు కచ్చితంగా 10 నుండి 13 గంటలసేపు నిద్రపోవాలి. 13 ఏళ్ల లోపు వాళ్ళు అయితే తొమ్మిది నుండి 11 గంటల సేపు నిద్రపోవాలి.

14 నుండి 17 ఏళ్లు లోపు ఉండే టీనేజర్స్ 8 నుండి 10 గంటల సేపు నిద్రపోతే మంచిది ఇక 18 నుండి 64 ఏళ్ల వరకు ఉన్న వాళ్లు అయితే రోజుకి 7 నుండి 9 గంటలసేపు నిద్రపోవాలి. అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. 65 ఏళ్ల పైబడిన వాళ్లయితే ఏడు నుండి ఎనిమిది గంటలసేపు నిద్ర పోవాలి. చాలా మంది నిద్రపోతున్నాం కదా ఆరోగ్యంగా ఉంటాంలే అని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి వయసును బట్టి నిద్రపోవాలి. వయసును బట్టి ఎంతసేపు నిద్ర పోవాలని తెలుసుకుని అలా పాటిస్తే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు అనారోగ్య సమస్యలు ఏమి కూడా ఉండవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version