అగ్నివీర్ పరీక్షకు ఎలా ప్రిపేర్ అవ్వాలి..ఏ టాపిక్స్ పై ఎక్కువ మార్కులు వస్తాయో తెలుసా..?

-

అగ్నివీర్ ఉద్యోగాలకు సంభంధించిన నోటిఫికేషన్ ను ప్రభుత్వం తాజాగా విడుదల చేరింది.ఈ పరీక్షలలో మంచి మార్కులు రావాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి..ఏఏ సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు వస్తాయి..ఎలా ప్రిపేర్ అవ్వాలి..ఎలా రాయాలి అనే అంశం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ మొదటి బ్యాచ్ రిక్రూట్‌మెంట్ కోసం ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి రిక్రూట్ మెంట్ టెస్ట్ లు, ర్యాలీలు నిర్వహించేందుకు రంగం సిద్దమైంది. ఇలా వివిధ విభాగాలలో రాత పరీక్షలు, ఫిజికల్, మెడికల్ రౌండ్ లలో సెలక్ట్ అయిన వారి నుండి షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను డిసెంబర్ 01,2022న ప్రొవిజన్ సెలక్ట్ లిస్ట్ రౌండ్‌కు పిలుస్తారు. ఇక్కడ సెలక్ట్ చేసిన వారితో కూడిన లిస్ట్ ను ఈ ఏడాది డిసెంబర్11, 2022న ప్రకటిస్తారు. అనంతరం డిసెంబరు చివరి నాటికి మొదటి బ్యాచ్ నమోదును సిద్దం చేసి, డిసెంబర్ 30, 2022 నాటికి శిక్షణ ప్రారంభమవుతుంది..

అర్హత సాధించాలంటే మొత్తం 5 రకాల పరీక్షలు ఎదుర్కోవాలి. 1) ఆన్ లైన్ రిటన్ ఎగ్జామ్, 2)డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ రౌండ్, 3)ఫిజికల్ టెస్ట్ 4) అడాప్టబిలిటీ టెస్ట్ 5) మెడికల్ టెస్ట్ ఇలా ఐదు రకాల పరీక్షలు ఎదుర్కోవాలి. ఇలా ఐదు రకాల పరీక్షలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి..

ఈ పరీక్షల్లో ప్రధానమైనది ఫేజ్ 1లో ఆన్‌లైన్ రిటన్ పరీక్షను ఉంటుంది. ఈ రిటన్ ఎగ్జామ్ మూడు విభాగాలుగా జరుగుతాయి. 1)Science, 2)Other than Science, 3)Science and other than Science అనే మూడు గ్రూపులుగా జరుగుతాయి..

ముందుగా అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్ ద్వారా వారికి ఆ ఎగ్జామ్స్ ను నిర్వహిస్తారు.ఈ ఎగ్జామ్ ఇంగ్లిష్ మరియు హిందీలో ఉంటుంది.పరీక్షలో అడిగే ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు ఇవ్వబడుతుంది మరియు ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కు ఉంటుంది. Science, Other than Science సబ్జెక్ట్స్ ఇలా రెండింటినీ ఎంచుకునే అభ్యర్థులకు పరీక్ష ఒకే సిట్టింగ్‌లో, ఒకే సిస్టమ్ పై నిర్వహించబడుతుంది..

సైన్స్: ఈ గ్రూప్ కు సంబందించిన పరీక్ష వివరాలు చూస్తే..ఇందులో ఇంగ్లీష్ 20, మేధమేటిక్స్ 25, ఫిజిక్స్ 25 మార్కులు కలిపి 70 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 60 నిమిషాలు సమయం ఇస్తారు..

అథర్ ద్యాన్ సైన్స్: గ్రూపుకి సంబంధించిన పరీక్షఇందులో రీజనింగ్ అండ్ జనరల్ అవేర్ నెస్ 30 మార్కులు, ఇంగ్లీష్ 20 మొత్తం 50 మార్కులకు పరీక్ష ఉంటుంది. 45 నిమిషాల సమయం ఇస్తారు..

సైన్స్ మరియు అథర్ ద్యాన్ సైన్స్: గ్రూపుకు సంబంధించిన పరీక్ష ఇందులో మేధమేటిక్స్ 25, ఇంగ్లీష్ 20, రీజనింగ్ & జనరల్ అవేర్‌నెస్ 30, ఫిజిక్స్ 25 మార్కులు కలిపి 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 85 నిమిషాలు సమయం ఇస్తారు. ప్రధానంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ పరీక్షలో మూడు గ్రూపులుగా జరిగినా.. ఐదు సబ్జెక్ట్ లు ఉన్నాయి. అవి ఇంగ్లీష్ (English), మేధమేటిక్స్ (Mathematics), ఫిజిక్స్ (physics), రీజనింగ్ (Reasoning) అండ్ జనరల్ అవేర్ నెస్ (General Awareness). వీటిని ప్రణాళికాబద్ధంగా చదివితే జాబ్ మీ సొంతం.. ఇది గుర్తించుకోని చదివితే జాబ్ మీ సొంతం..

Read more RELATED
Recommended to you

Exit mobile version