జాతరలో పానీ పూరి తిని వందమంది పిల్లలకు అస్వస్థత

-

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మండ్లా జిల్లాలో గిరిజనులు అధికంగా ఉండే సింగర్పూర్ లో శనివారం రాత్రి జరిగిన జాతరలో ఒకే షాపులో పానీపూరి తిన్న దాదాపు వంద మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ తో వారు బాధపడ్డారని, వారిని జిల్లా ఆసుపత్రిలో చేర్పించామని ఆదివారం మధ్య ప్రదేశ్ వైద్య శాఖ అధికారులు మీడియాకు తెలిపారు. ఆ పానీ పూరి తిన్న పిల్లలందరికి వాంతులు, కడుపు నొప్పితో బాధ పడ్డారు అని వివరించారు.

వారందరికీ వైద్యులు చికిత్స అందించాలని బాధితులు కోరుకుంటున్నారని తెలిపారు. పానీపూరి అమ్మిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. అలాగే సంబంధిత అధికారులు పానీపూరి శాంపిళ్లను సేకరించి, వాటిని పరీక్షించేందుకు పంపారని వివరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలను పలువురు మంత్రులు పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version