Breaking: భార్యకు చీర కట్టుకోవడం రాదని భర్త ఆత్మహత్య

-

ఇటీవలి కాలంలో జరుగుతున్న ఆత్మహత్యలు చూస్తే చాలా సిల్లీగా అనిపిస్తున్నాయి. కూరలో కారం ఎక్కువైందని, కోడి కూర వండటం లేదని, భార్య పుట్టింటికి వెళ్లిందనే చిన్న చిన్న కారణాలతో చాలా మంది ప్రాణాలు తీయడం.. లేదా ఆత్మహత్య చేసుకునే వార్తలు వింటూనే ఉన్నాం. ఈ వార్తలు విన్నప్పుడు చిర్రెత్తుతుంటుంది. అర్థం పర్థం లేని కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన మనసుని కలిచి వేస్తుంటుంది. చిన్నపిల్లల దగ్గరి నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఇలాగే ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది.

saree-police

పూర్తి వివరాళ్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో ఓ వ్యక్తికి ఆరు నెలల కిందట వివాహం జరిగింది. అయితే అతని భార్య తనకంటే ఆరేళ్లు పెద్దది. కానీ ఆమెకు చీర కట్టుకోవడం, సరిగ్గా మాట్లాడటం, నడవడం రాదు. దీంతో మనస్థాపానికి గురైన ఆ వ్యక్తి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సూసైడ్ నోట్‌లో తన భార్యకు చీర కట్టుకోవడం రాదని, నలుగురిలో తన పరువు పోతుందని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నాడు. కాగా, ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version