హుజురాబాద్, బద్వేల్ ప్రచారానికి బ్రేక్ : ఈసీ కీలక ఆదేశాలు

-

ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన హుజురాబాద్ నియోజకవర్గ ప్రచారానికి.. కాసేపటి క్రితమే బ్రేక్ పడింది. ఈసీ ఆదేశాలతో హుజరాబాద్ నియోజకవర్గం లో ప్రచారానికి… తెరపడింది. ఉప ఎన్నికకు 72 గంటల ముందే… బద్వేల్ మరియు యు.వి రాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఈ సందర్భంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. 72 గంటల ముందే సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ నియోజక వర్గం లో స్థానికేతరులు ఉండకూడదని ఆదేశించారు.

ఇక నుంచి ఏ రకమైన ప్రచారం ఉండదని.. ఎన్నికల అధికార బృందాలు రంగంలోకి దిగాయని చెప్పారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 29న హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని.. 30 న ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకూ పోలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే కరీంనగర్ SRR కాలేజీలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక అటు ఇవే రూల్స్ బద్వేల్ లోనూ అమలు కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news