తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు, రైతుబంధు పథకాల ను హుజురాబాదులోని శాలపల్లి గ్రామంలో ప్రవేశపెట్టారు. ముఖ్యంగా హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో శాలపల్లి నుండి కేసీఆర్ దళిత బందును ప్రవేశపెట్టారు. అయితే ఈ గ్రామంలోనే కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. శాలపల్లి తో పాటు చుట్టుపక్కల గ్రామాలలో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ప్రతిపక్షాలు ముందుండి ఆరోపిస్తూ వస్తున్నాయి.
అయితే తాను ఎన్నికల్లో గెలిచేందుకు పథకాలను ప్రవేశ పెడతామని తమది సన్నసుల పార్టీ కాదు అని రాజకీయ పార్టీ అని కేసీఆర్ స్వయంగా వ్యాఖ్యానించారు. అయితే దళిత బంధు పథకం కింద కేసీఆర్ ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ప్రకటించినప్పటికీ ఆయా గ్రామాలలో టిఆర్ఎస్ ఆధిక్యంలో లేకపోవడం టిఆర్ఎస్ కు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ఆయా గ్రామాలలో దళిత బంధు పథకం కొన్ని కుటుంబాలకు మాత్రమే వచ్చింది. దాంతో దళిత బంధు అందుకోని కుటుంబాల నుండి తీవ్రవ్యతిరేకత వచ్చినట్టు తెలుస్తోంది.