మురళిమోహన్‌కు హైడ్రా నోటీసులు..ఆయన ఏమన్నారంటే?

-

హైదరాబాద్‌ పరిధిలోని చెరువులు, నాలాలు, కుంటల పరీరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రా వ్వవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.ఈ సంస్థ తన పనిని తాను చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది.ప్రభుత్వం నుంచి ఫుల్ సపోర్టు ఉండటంతో అధికార, ప్రతిపక్షం అని తేడా లేకుండా చెరువు ప్రాంతాల స్థాలాలను ఆక్రమించి కట్టిన కట్టడాలను హైడ్రా కూల్చివేస్తోంది.ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కట్టిన కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తోంది. ఇలాంటి వ్యవస్థ జిల్లాల్లోనూ తేవాలని కొందరు సామాజిక, పర్యావరణ వేత్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

అయితే, సీనియర్ యాక్టర్, టీడీపీ మాజీ ఎంపీ మురళీ మోహన్‌కు చెందిన జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని రంగలాల్ కుంట ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు తొలగించాలని నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. 15 రోజుల్లోగా కూల్చకపోతే తామే కూలుస్తామని హైడ్రా హెచ్చరించినట్లు వార్తలు వస్తుండగా.. దీనిపై ఆయన స్పందిస్తూ.. తాను చాలా కాలంగా రియల్ రంగంలో ఉన్నానని, ఎప్పుడూ ఆక్రమణలకు పాల్పడలేదన్నారు. కేవలం మూడు అడుగుల స్థలం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు నోటీసులు వచ్చాయి.అందులో రేకుల షెడ్డు మాత్రమే ఉందని, దానిని తొలగిస్తామని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version