ముందే చెప్పాను కదా .. కోహ్లీ ఫామ్ పై రోహిత్ శర్మ ఆగ్రహం

-

లార్డ్స్ స్టేడియంలో ఇంగ్లండ్ తో జరిగిన రెండో వన్డే ఇంటర్నేషనల్ లో భారత జట్టు పరాజయం పాలు కావడం తెలిసిందే. అయితే టాప్ ఆర్డర్ నిలదొక్కుకోలేక పోయింది అన్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఇన్నింగ్స్లో బౌలర్లు రాణించిన విషయాన్ని గుర్తు చేశాడు.ఐతే టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో సెంచరీ సాధించి దాదాపు మూడు ఏళ్ళు అవుతుంది. అయితే కోహ్లీ పైన మాజీ క్రికెటర్లు ఫోకస్ చేస్తున్నారు.

కోహ్లీ ని సెలక్టర్లు పక్కన పెట్టాలి అంటూ ఇటీవల మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఫామ్ పై ఇదివరకే కుండ బద్దలు కొట్టినట్టు తన అభిప్రాయం చెప్పిన రోహిత్ శర్మకు గురువారం రెండో వన్డే అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. దీంతో అతడు అసహనానికి గురయ్యాడు. “కోహ్లీ ఇన్నేళ్లుగా వందలాది మ్యాచ్ లు ఆడాడు. భరోసా ఉండాల్సిన అవసరం లేని బ్యాటర్ అతడు.

నేను నా గత ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఇదే విషయం చెప్పాను.. మళ్లీ అదే చెబుతున్నాను. ప్రతి క్రికెటర్లలో ఫామ్ లేమి సహజం. ఇన్నాళ్లుగా క్రికెట్ ఆడుతున్న వాళ్ళు తిరిగి ఫామ్ అందుకోవడానికి ఒకటి, రెండు ఇన్నింగ్స్ చాలు. కోహ్లీ ఫామ్ గురించి బయట చర్చ జరుగుతుందని నాకు కూడా తెలుసు. కానీ ఏ క్రికెటర్ కెరీర్లో అయినా ఎత్తుపల్లాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి”. అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news