ప్రస్తుత కాలంలోనే కాదు నాటి నుంచి నేటి వరకు చాలామంది హీరోయిన్లు ఇలా బాడీ షేమింగ్ కి గురవుతున్న విషయం తెలిసిందే. ఇక వారే ఒక్కొక్కరిగా తమ బాధలను మీడియాతో పంచుకుంటున్నారు. సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన నటీనటులు తొలి రోజుల్లో ఎన్నో చీత్కారాలను , అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవకాశాల కోసం పరిశ్రమలో తిరిగేటప్పుడు కమిట్మెంట్, అవమానాలు , చేదు ఘటనలు ఇలా కొంతమంది ఎదుర్కొనే ఉంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో మహిళా నటీమణులే చేదు ఘటనలను ఎక్కువగా ఎదుర్కొంటారని చెప్పవచ్చు.
ఈ క్రమంలోనే ప్రముఖ టీవీ షో అనుపమ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న రూపాలీ గంగూలీ.. బాలీవుడ్ బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపున సొంతం చేసుకుని ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఇంతటి క్రేజ్ తెచ్చుకున్నప్పటికీ కూడా ఒకానొక దశలో తాను కూడా బాడీ షేమింగ్ కి గురైనట్లు చెప్పుకొచ్చింది. తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ కెరియర్ లో ఎదురైనా దుర్ఘటనల గురించి వివరించింది. ఆమె మాట్లాడుతూ.. నాకు ఎంతో పేరు తెచ్చి పెట్టిన అనుపమ షో తర్వాత నేను కూడా బాడీ షేమింగ్ ఎదుర్కొన్నాను.
మీ శరీరంపై ముడతలు కనిపిస్తున్నాయి.. లావుగా ఉన్నారు అంటూ నన్ను చాలామంది ఎగతాలి చేశారు. ఇక. నా భర్త కంటే నేను వయసులో పెద్ద అనే విషయంలో కూడా నన్ను ట్రోల్స్ చేశారు అంటూ తన జీవితంలో ఎదురైన చేదు సంఘటనల గురించి వివరించింది రూపాలి. ఇకపోతే తన భర్త కంటే తాను నాలుగేళ్లు పెద్దదాన్ని అని ఆ విషయంలో తాను గర్వపడుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక మేము ఈ షోలో భార్యాభర్తల పాత్రలు మాత్రమే పోషించామని.. నా పాత్రకు నేను వంద శాతం న్యాయం చేశాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది.