బీఆర్ఎస్ ఆఫీసును కూలిస్తే అస్సలు ఊరుకోం : గులాబీ నేతల హెచ్చరిక

-

నల్లగొండ బీఆర్ఎస్ ఆఫీసును కూల్చి వేయాలని బుధవారం తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయగా.. కూలిస్తే సహించేది లేదని బీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు.దీంతో నిన్న రాత్రి నుంచి పార్టీ ఆఫీసులోనే బస చేస్తున్నారు. బిల్డింగుకు కాపాలాగా ఉంటున్నారు.హైకోర్టు తీర్పు నేపథ్యంలో అవసరమైతే సుప్రీం కోర్టుకు కూడా వెళతామని,కార్యాలయం కూలుస్తుంటే చూస్తూ ఊరుకోబోమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి హెచ్చరించారు. కాగా, ఇది కోర్టు తీర్పును ధిక్కరించడమేనని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.

నల్లగొండ బీఆర్ఎస్ భవనం అనుమతులు లేకుండా కట్టారని, ఈ భవనాన్ని కూల్చేయాలని స్థానిక కాంగ్రెస్ నేత,రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేకసార్లు అధికారులను ఆదేశించారు.దీంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.తమ కార్యాలయానికి అనుమతులు ఇవ్వాలని,కూల్చివేయకుండా అడ్డుకోవాలని కోర్టును కోరాగా..కోర్టు మాత్రం అనుమతులు నిర్మాణానికి ముందు తీసుకోవాలని,ఇప్పుడు ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంటూ వెంటనే ఆ భవనాన్ని కూల్చేయాలని తీర్పునిచ్చింది. దీంతో బీఆర్ఎస్‌ నేతలు షాక్ కు గురయ్యారు. కాగా, రాష్ట్రంలోని ఏ బీఆర్ఎస్ ఆఫీసులకు అనుమతులు లేవని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version