ఇలా చేసారంటే.. టమాటాలు రెండు నెలలైనా ఫ్రెష్ గానే ఉంటాయి..!

-

టమాటాలు త్వరగా పాడైపోతూ ఉంటాయి. టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు పాటు మీరు స్టోర్ చేసుకోవాలంటే ఇలా చేయండి. ఇలా చేయడం వలన రెండు నెలలైనా కూడా టమాటాలు ఫ్రెష్ గానే ఉంటాయి. పాడైపోవు. టమాటాలని రూమ్ టెంపరేచర్ లో ఉంచడం మంచిదే. రూమ్ టెంపరేచర్ లో టమాటాలని ఉంచితే రుచి పోదు. టమాటాలు త్వరగా పాడవకుండా ఉండాలంటే కిందకి కాండం ఉండేటట్టు పెట్టాలి వీటిని సూర్య రష్మికి దూరంగా ఉంచితే ఎక్కువ రోజులు పాటు ఫ్రెష్ గా ఉంటాయి.

టమాటాలని కొనేటప్పుడు ఆకుపచ్చగా ఉండే వాటిని తెచ్చుకోండి. ఎక్కువ రోజులు అప్పుడు అవి నిల్వ ఉంటాయి. టమాటాలని మీరు స్టోర్ చేసేటప్పుడు తేమ లేని ప్రదేశం లో పెట్టండి అలా చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. టమాటాలను రెగ్యులర్ గా చెక్ చేస్తూ పాడైన వాటిని తొలగిస్తూ ఉండండి.

ఎక్కువ రోజులు టమాటాలు నిల్వ ఉండాలంటే వాటిని కట్ చేసి ఫ్రీజర్ లో పెడితే గట్టిగా అయిపోతాయి. ఐస్ క్యూబ్ లాగ తయారవుతాయి వాటిని గాలి వెళ్లలేని కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే మూడు నాలుగు నెలలు కూడా వాడుకోవచ్చు. టమాటాలని కడిగేసి మీరు వాటిని తుడిచేసే ప్యూరీలా చేసుకుని స్టోర్ చేసుకుంటే 15 రోజులు వరకు అవి పాడైపోకుండా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news