గబ్బిలాల వల్ల వైరస్‌లు వస్తుంటే.. అక్కడ ప్రజలకు వేలల్లో డబ్బులు వస్తున్నాయట..!

-

గబ్బిలాలు అనగానే ముందు మనకు పాడుబడిన ఇళ్లు, బూతు బంగళాలే గుర్తుకువస్తాయి కదా..! ఎందుకుంటే.. ఎలాంటి సంచారం లేని ప్రాంతంలోనే గబ్బిలాలు గూడు కట్టుకుంటాయి. కానీ వీటితో వ్యాపారం చేయొచ్చని మీకు తెలుసా..? అది కూడా సాదాసీదా బిజినెస్‌ కాదు.. రోజుకు వేలల్లో సంపాదించవచ్చు. దక్షిణ కన్నడ జిల్లా ఉప్పినంగడి ప్రజలు గబ్బిలాల వల్ల విపరీతంగా లాభాలు గడిస్తున్నారు.

దట్టమైన అడవుల్లో గబ్బిలాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా పాడు బడిన ఇళ్లలో, బంగ్లాలలో మనం తరచుగా గబ్బిలాలు ఉండటాన్ని చూస్తుంటాం. అదే విధంగా వెలుతురు లేని గుట్ట ప్రాంతాల్లో కూడా ఉంటాయి. గబ్బిలాలు ముఖ్యంగా సాయంత్రం తర్వాత గుంపులుగా సంచరిస్తుంటాయి. గబ్బిలాలు చెట్ల గింజలను, చిన్న కీటకాలను కూడా తింటుంటాయి. అసలు ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన కరోనా కూడా ఈ గబ్బిలాల వల్లే వచ్చిందని టాక్‌.. అలాంటిది గబ్బిలాల వల్ల ఉప్పినంగడి స్థానికులు ప్రతిరోజు వేల రూపాయల లాభాలు పొందుతున్నారు.

దక్షిణ కన్నడ జిల్లా ఉప్పినంగడిలోని సహస్రలింగేశ్వరాలయానికి సమీపంలో ఉన్న వనభోజన శ్రీ వీరాంజనేయ దేవాలయం చుట్టూ ఉన్న చెట్లకు వేల సంఖ్యలో గబ్బిలాలు ఆశ్రయించాయి. ఈ గబ్బిలాలు స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎంతో ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. స్థానికంగా ఉండే గింజ తోటలు, గెరా పండ్ల చెట్లకు రాత్రిపూట గబ్బిలాలు వెళ్లి పండ్లు తిని తిరిగి చెట్టు వద్దకు పండ్లను తీసుకువస్తాయి. ఇలా తెచ్చిన కాయలు, గెరా విత్తనాలు వేలల్లో చెట్టుకింద పడిపోతాయి. ఇలా రాలిన కాయలు, గెరా పండ్ల విత్తనాలు ప్రజలకు ఎంతో ఆదాయాన్ని తెస్తున్నాయట.

స్థానిక ప్రజలకు రోజుకు వెయ్యికి పైగా కాయలు అందుబాటులో ఉంటాయట. ప్రస్తుతం వాల్‌నట్‌ ధర కిలో నాలుగు వందలు పలుకగా, వెయ్యికి పైగా వాల్‌నట్‌లు ఏడెనిమిది కిలోల వాల్‌నట్‌లను ఉత్పత్తి చేస్తున్నాయి. గేరు పండ్ల విషయంలో కూడా గబ్బిలాలు పండ్లతో పాటు విత్తనాలను తెస్తుంటాయి, గేరు విత్తనాల ద్వారా కూడా స్థానిక ప్రజలకు వేల రూపాయలు లభిస్తున్నాయి.

కొన్ని చోట్ల పబ్లిక్ ఏరియాలోని చెట్లలో గబ్బిలాలు ఉంటే ఆ చెట్ల కింద పడిపోయిన కాయను తీసుకెళ్లేందుకు టెండర్ పిలుస్తున్నారు. ఓర్ని ఇది మరీ బాగుంది కదా.! సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అంటే ఇదేనేమో..! టెండర్ ద్వారా కాయలు, విత్తనాలు వేసే ప్రక్రియ కూడా ఉప్పినంగడిలో కొనసాగుతోంది. కేరళలో గబ్బిలాలు నిఫా వైరస్ ముప్పు తెస్తుంటే, ఇక్కడ దక్షిణ కన్నడలో గబ్బిలాలు ప్రజలకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. కిస్మత్‌ అలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version