పర్యావరణాన్ని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందన్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. పర్యావరణంతో కలిసి జీవించడం మనందరి ప్రాథమిక బాధ్యతన్నారు. జీవన విలువలలో పర్యావరణ పరిరక్షణను ఒక భాగంగా చేసుకోవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పర్యావరణం ఒక శాశ్వత ఆర్థిక వ్యవస్థ… అలాంటి వ్యవస్థను కొంత మంది అత్యాశ వల్ల పూర్తిగా మానవాళికి చేటు జరిగేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు బండారు దత్తాత్రేయ.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు నూతన ధోరణుల గురించి వివరించాలని సూచించారు. నేటి సమాజంలో నూతన సవాళ్లు ఎదురవుతున్నాయని , వాటికనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. అనంతరం ఆయన కళాశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రొఫెసర్లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.