ఈ పని చేస్తే రైతుల అకౌంట్ లోకి ప్రతినెలా రూ.3 వేలు జమ..!!

-

రైతుల అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు..ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా ప్రజలకు ఆసరాగా నిలబడ్డారు.పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి ఏడాది రూ.6 వేల చొప్పున రైతుల అకౌంట్ లోకి వేస్తున్నారు..అలాగే కిసాన్ మన్దన్ యోజన. 60ఏళ్లు పైబడిని రైతులు ఈ పథకానికి అర్హులు.ప్రభుత్వం ప్రతినెలా మూడు వేల రూపాయలను పింఛనుగా అందజేస్తుంది. 18 నుంచి 40ఏళ్లలోపు రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే, ఈ దరఖాస్తు చేసుకునే రైతులకు రెండు ఎకరాల భూమి ఉండాలి. 18ఏళ్లు నిండిన రైతులు ఈ పథకంలో చేరితే…మీరు ప్రతినెలా రూ. 55 డిపాజిట్ చేయాలి. 30ఏళ్ల వయస్సులో అయితే రూ. 110, 40ఏళ్లు అయితే రూ. 200కి పెరుగుతుంది. రైతుకు 60ఏళ్ల తర్వాత ఈ మొత్తాన్ని పెన్షన్ రూపంలో అందిస్తుంది ప్రభుత్వం..

ఈ పథకం కోసం ఎలా అప్లై చేయాలి?

*. మీ సమీపంలోని మీ సేవా కేంద్రానికి వెళ్లండి.
*. ఇన్ కమ్ సర్టిఫికెట్, భూమికి సంబంధించిన పత్రాలు సమర్పించాలి.
*. మీ అకౌంట్లో డబ్బు జమ కావాలంటే మీ బ్యాంక్ అకౌంట్ సమాచారాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
*. దరఖాస్తు ఫారమ్ పై మీ ఆధార్ కార్డుతో లింక్ చేయండి.
*. అప్పుడు మీకు పెన్షన్ అకౌంట్ నెంబర్ ఇస్తారు.
ఈ పథకాన్ని పొందేందుకు మీరు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. మీ సమీపంలోని కామన్ సర్విస్ సెంటర్ లో దరఖాస్తు చేసుకోవాలి. maandhan.in కి వెళ్లి…అక్కడ మీరే నమోదు చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్, ఓటీపీ గురించి సమాచారం అడుగుతారు. రైతులు 60ఏళ్లు నిండిన తర్వాత ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని పించన్ రూపంలో అందిస్తుంది ప్రభుత్వం..ఎవరి మీద ఆధార పడకుండా ఇది ఉపయోగపడుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news